'మూడు గంటలు ఇచ్చే వాళ్ల, లేక 24 గంటల కరెంటు ఇచ్చేవాళ్లు కావాలా'
మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ వాళ్లు కావాలా, 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాలా అన్న విషయం మీరే తేల్చుకోవాలని ఆత్మకమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెద్ద బచ్చగారి నరసింహారెడ్డి అన్నారు.
దిశ, భిక్కనూరు : మూడు గంటలు కరెంటు ఇచ్చే కాంగ్రెస్ వాళ్లు కావాలా, 24 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేస్తున్న సీఎం కేసీఆర్ ప్రభుత్వం కావాలా అన్న విషయం మీరే తేల్చుకోవాలని ఆత్మకమిటీ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెద్ద బచ్చగారి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం భిక్కనూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో కరెంటు సమస్య నెలకొనేదని, తద్వారా నాణ్యమైన కరెంటు సరఫరా కాకపోవడం వలన ట్రాన్స్ ఫార్మర్లు వ్యవసాయ బావుల వద్ద మోటర్లు తరచూ కాలిపోతుండేవన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వ్యవసాయ రంగానికి ఉచితంగా 24 గంటల నాణ్యమైన కరెంటు సరఫరా చేస్తున్నామని తద్వారా ఇప్పుడు మోటర్లు కాలిపోవడం, ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం వంటి సమస్యలు తలెత్తడం లేదని స్పష్టం చేశారు.
గృహఅవసరాలకు కోతలు విధించకుండా కరెంటు సరఫరా చేస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమన్నారు. సీఎం కేసీఆర్ పై సినిమా డైలాగులు కొట్టినట్లు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రఫ్ గా మాట్లాడితే ఊరుకునేది లేదని, నియోజకవర్గ ప్రజలే నీకు ఓటుతో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితిలో నియోజకవర్గ ప్రజలు లేరని, సీఎం కేసీఆర్ ను భారీ మెజార్టీతో గెలిపిస్తామన్నారు. ఈ సమావేశంలో ఎంపీపీ అధ్యక్షులు జాంగారి గాల్ రెడ్డి, సర్పంచి తునికి వేణు, ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ అందె మహేందర్ రెడ్డి, రైతుబంధు సేవా సమితి చైర్మన్ బోండ్ల రామచంద్రం, సొసైటీ చైర్మన్లు నాగర్తి భూoరెడ్డి, గంగల భూమయ్య, పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అంబల్ల మల్లేశం, ఏఎంసీ మాజీ చైర్మన్ బాణాల అమృత రెడ్డి, మాజీ సర్పంచ్ తాటిపాముల నాగభూషణం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.