దిశ ఎఫెక్ట్...ల్యాబ్ టెస్ట్ కోసం నీటి శ్యాంపుల్ సేకరణ

బుధవారం దిశ డైనమిక్ లో ప్రచురితమైన బాబోయ్ జెనిగలు అనే కథనానికి అధికార యంత్రాంగం కదిలింది.

Update: 2024-01-06 09:37 GMT

దిశ, కోటగిరి : బుధవారం దిశ డైనమిక్ లో ప్రచురితమైన బాబోయ్ జెనిగలు అనే కథనానికి అధికార యంత్రాంగం కదిలింది. కోటగిరి మండల కేంద్రంతో పాటు మరికొన్ని గ్రామాలలో మిషన్ భగీరథ నీటిలో గత కొద్దిరోజులుగా కలుషితమైన నీటితోపాటు రక్తం తాగే జలగలు రావడంతో చాలామంది రోగాల పాలయ్యారు. బుధవారం దిశ డైనమిక్ లో వచ్చిన వార్తతో ఎట్టకేలకు అధికార యంత్రాంగం కదిలి వచ్చి మండల కేంద్రంలోని వినాయక్ నగర్ కాలనీలో ల్యాబ్ టెస్టు నిమిత్తం వాటర్ శ్యాంపిళ్లను తీసుకొని వెళ్లారు. 


Similar News