కలెక్టర్ కార్యాలయం ముందు రైస్ మిల్ ఆపరేటర్ల ధర్నా

తెలంగాణ కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, వేతనాలు పెంచాలని ఓమయ్య అన్నారు.

Update: 2024-01-08 10:17 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: తెలంగాణ కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, వేతనాలు పెంచాలని ఓమయ్య అన్నారు. సోమవారం ఏఐటీయుసీ ఆధ్వర్యంలో రైస్ మిల్లులో పనిచేస్తున్న ఆపరేటర్లు, హెల్పర్లతో కాలూర్ రోడ్‌లోని ఏఐటీయూసీ కార్యాలయం నుంచి ప్రదర్శన నిర్వహించి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరిగిందని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై .ఓమయ్య తెలిపాపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైస్ మిల్ ఇండస్ట్రీలో గత అనేక సంవత్సరాలుగా ఆనవాయితీగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కార్మికుల వేతనాలు పెంచుకోవడం జరుగుతుందని గత వేతన ఒప్పందం కాల పరిమితి అక్టోబర్ 31తో ముగిసిన నవంబర్ ఒకటో తారీకు నుంచి నూతన వేతనాలు అమల్లోకి రావలసి ఉన్న యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల నేటికీ పెంచకపోవడంతో ఈరోజు ధర్నా నిర్వహించడం జరిగిందని అన్నారు. ఇప్పటికైనా యాజమాన్యం కార్మికుల వేతనాలు పెంచడంతోపాటు అందరికి పీఎఫ్, ఈఎస్ఐ, ఇన్సూరెన్స్ సౌకర్యాలు కల్పించాలని తెలంగాణ కార్మికులకే మొదటి ప్రాధాన్యతగా ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించాలని, ఇతర రాష్ట్రాల కార్మికులకు కూడా కనీస వేతనాలు, కార్మిక చట్టాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెకు వెళతామని అన్నారు. సంబంధించిన మెమొరండాన్ని జిల్లా కలెక్టర్ ఇవ్వటం జరిగిందని కలెక్టర్ సానుకూలంగా స్పందించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పి. నర్సింగరావు, యూనియన్ జిల్లా కార్యదర్శి బి .అనిల్ నాయకులు జాఫర్, రమేష్, బసప్ప, లాయక్, ప్రసాద్, తిరుపతిరెడ్డి, గంగాధర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.


Similar News