కాంగ్రెస్ తోనే అభివృద్ధి సాధ్యం.. వినయ్ కుమార్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నారు.
దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్ పార్టీతోనే బడుగు బలహీన వర్గాల అభివృద్ధి సాధ్యమని ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ప్రొద్దుటూరు వినయ్ కుమార్ రెడ్డి అన్నారు. సోమవారం ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి వినయ్ రెడ్డి మాక్లుర్ మండలంలోని కొత్తపల్లీ, గుంజిలి, చిక్లి, గ్రామాలలో విజయ భేరి ఎన్నికల కాంగ్రెస్ ప్రచారాన్ని గడపగడపకు నిర్వహించారు. ఈ సందర్భంగా వినయ్ రెడ్డి ప్రజలతో మాట్లాడుతూ ఇప్పటి వరకు లోకల్ వ్యక్తి ఎమ్మెల్యే కాలేదని, పక్క నియోజకవర్గం నుండి వచ్చి ఎమ్మెల్యే గా అయ్యా డన్నారు. ఈసారి లోకల్ వ్యక్తి మనోడు ఎమ్మెల్యే వుంటే మన బాధలు తెలుస్తాయి పక్కొల్లకి ఎం తెలుస్తాయి అని వినయ్ రెడ్డి అన్నారు.
అందుకే ఈసారి నాకు అవకాశం ఇవ్వండి, ప్రతి ఊరిలో వాటర్ ట్యాంక్ లను కట్టించినది కాంగ్రెస్ మాత్రమే నని, ఈ పదేళ్ల బీఆర్ఎస్ జీవన్ రెడ్డి పాలనలో ఈ గ్రామాల్లో జరిగిన మేలు శూన్యం అని అన్నారు. ఒక్క గ్రామంలో కూడ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళుకాని, ఇళ్ల స్థలలు కాని ఇవ్వలేదు అని అన్నారు. వడ్ల ధ్యానంలో కడతా పేరు మీద ఎమ్మెల్యే కమిషన్లు దండుకున్నాడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో వినయ్ రెడ్డి సతీమణి అనన్యరెడ్డి, గోర్త రాజేందర్, మండల అధ్యక్షులు రవి ప్రకాష్, మంద మహిపాల్, భూమేశ్, ముక్కెర విజయ్, గంగాధర్ గౌడ్, వెంకటేశ్వర్లు, డేగ పోశెట్టీ, దెగం గంగా రెడ్డి, వంజరి రాము, గంగయ్య, సాయి రామ్, పురుషోత్తం, రాజు, వినోద్, అరిఫ్ , సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్, బీజేపీల నుంచి కాంగ్రెస్ లోకి చేరికలు..
ఆర్మూర్ నియోజకవర్గంలోని మాక్లురు మండలంలోని వల్లభాపూర్ గ్రామ మాజీ సొసైటీ చైర్మన్ దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందిపేట్ మండలంలోని లక్కంపల్లి మాజీ ఎంపీటీసీ కొమిరే ముత్తెన్న బీఆర్ఎస్ ను వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నందిపేట్ మండలంలోని తల్వేద గ్రామానికి చెందిన యాదవ సంఘం 25 మంది సభ్యులు, గ్రామ కమిటీ అధ్యక్షుడు గంగయ్య ఆధ్వర్యంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరందరికీ ఆర్మూర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి పొద్దుటూరి వినయ్ కుమార్ రెడ్డి, నందిపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మంద మహిపాల్ లు కాంగ్రెస్ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పిప్పెర సాయి రెడ్డి, గాదె శ్రీనివాస్, శ్రీకాంత్, మల్క గంగారెడ్డి, నడపన్న, రాజలింగం, భూషణ్, గంగారెడ్డి, తోట రాములు, కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.