మరణించినా మరొకరికి జీవం

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ కాగా కుటుంబీకులు అవయవ దానం చేసి తమ దాత్రుత్వాన్ని చాటుకున్నారు.

Update: 2024-02-14 16:12 GMT

దిశ, కామారెడ్డి : రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడి బ్రెయిన్డెడ్ కాగా కుటుంబీకులు అవయవ దానం చేసి తమ దాత్రుత్వాన్ని చాటుకున్నారు. కానిస్టేబుల్ గా విధులు నిర్వహించే బెజ్జంకి కార్తీక్ (33) అనే యువకుడు ఈనెల 11న బైకుపై వస్తుండగా దేవునిపల్లిలో కుక్క అడ్డు రావడంతో అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్ర గాయాల పాలైన కార్తీక్ ను కామారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్ తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు

     కార్తీక్ కు బ్రెయిన్ డెడ్ అయిందని తెలపడంతో కుటుంబీకులు అతని అవయవాలు దానం చేసేందుకు ముందుకు వచ్చారు. వైద్యుల పర్యవేక్షణలో కార్తీక్ అవయవాలను మరో పదిమంది రోగులకు దానం చేసి వారికి ప్రాణదానం చేశారు. దీంతో కుటుంబీకులు, కార్తీక్ స్నేహితులు తమ మధ్యలో కార్తిక్ లేనప్పటికీ పదిమంది కుటుంబాల్లో ఎప్పుడు జీవిస్తూనే ఉంటాడని హర్షం వ్యక్తం చేశారు. అంతేగాకుండా కార్తీక్ కుటుంబీకులను ఇతరులు కూడా ఆదర్శంగా తీసుకోవాలని కోరుతున్నారు.


Similar News