Municipal Chairperson : ప్రమాదకర పాత ఇళ్లను వెంటనే తొలగించాలి..

ప్రమాదకరంగా, కూలడానికి సిద్ధంగా ఉన్నవి, సగం కూలిపోయిన ఇళ్లను వెంటనే తొలగించుకోవాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ కోరారు.

Update: 2024-07-24 13:39 GMT

దిశ, కామారెడ్డి : ప్రమాదకరంగా, కూలడానికి సిద్ధంగా ఉన్నవి, సగం కూలిపోయిన ఇళ్లను వెంటనే తొలగించుకోవాలని మున్సిపల్ ఛైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ కోరారు. బుధవారం కామారెడ్డి పట్టణంలోని టేక్రియాల్ 13వ వార్డును ఆమె పరిశీలించారు. ప్రమాదకరమైన పెచ్చులు ఊడిపోయి ఉన్న ఇళ్లను వెంటనే తొలగించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్ల గుంతలను, మురికి కాలువలను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని, మంచినీటి సౌకర్యం ఉండేటట్టు చూడాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు.

పారిశుధ్య నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత నిస్తున్నామన్నారు. జోన్ 1, జోన్ 2 గా మాస్ క్లీనింగ్ కోసం పెట్టారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డ్ కౌన్సిలర్ శంకర్ రావు, పాత శివ కృష్ణమూర్తి, చాట్ల వంశీ, అంజద్, సాయిబాబా, పంపరి శీను, రవి పాటిల్, పండు, శ్రీకాంత్, ఒడ్డెం సందీప్, చిట్టిబాబు, సుంకరి శ్రీనివాస్ బొట్టు, కుర్మ మహిపాల్, రాజేష్, కుర్మ మనోహర్, కొనింటి స్వామి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News