ప్రతికూల వాతావరణంతో పత్తి రైతులకు నష్టం

తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మండలం లోని రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

Update: 2024-01-10 05:29 GMT

దిశ, తాడ్వాయి : తెల్ల బంగారంగా పిలువబడే పత్తి పంట ఈ ఏడాది ఆశించిన స్థాయిలో దిగుబడి రాకపోవడంతో మండలం లోని రైతన్నలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. తాడ్వాయి మండల వ్యాప్తంగా సుమారు (2736) ఎకరాల్లో పత్తి పంట సాగు చేశారు. గత కొంత కొన్ని సంవత్సరాలుగా పత్తి పంట సాగు చేసి లాభపడ్డ రైతులకు ఈ ఏడాది నష్టాలను మిగిల్చింది. అయితే వాతావరణ పరిస్థితుల కారణంగా పూర్తిగా దిగుబడి తగ్గింది. ఉమ్మడి మండలంలో రైతులు అధికంగా వర్షదారం పైనే ఆధారపడి పంటలు సాగు చేస్తారు. పత్తి పంట పూత, ఖాతా సమయంలో వర్షాలు కురవకపోవడంతో ఆశించిన స్థాయిలో పంట దిగుబడి రాలేదు. దీంతో పత్తి పంట ఆశించిన స్థాయిలో ఏదుగలేదు. గత ఏడాది సుమారు ఎకరాకు 10 నుంచి 15 క్వింటాల్ పంట దిగుబడి వచ్చింది.

కానీ ఈ ఏడాది 5 నుంచి 6 క్వింటాళ్ల లోపే వచ్చింది.మరో వైపు కూలీలకు కిలో పత్తి తీయడానికి 10 నుంచి 15 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. రోజు వారి కూలికి కట్టియాలంటే 300 నుంచి 500 ఇవ్వాల్సిన పరిస్థితి గ్రామాలల్లో నెలకొంది. సిసిఐలో క్వింటాల్‌కు రూ,7020 మద్దతు ధర ఉన్నప్పటికీ నిబంధనల ప్రకారం రైతులు పత్తి ని అమ్ముకోలేకపోతున్నారు. ఒక వేళ రైతులకు డబ్బులు అత్యవసరం అయితే ప్రైవేటు వ్యక్తులకు అమ్ముదామనుకుంటే 6300 నుంచి 6600 ధర పలుకుతా ఉండడంతో రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. రైతు పండించిన పత్తి పంటకు ఆశించి స్థాయిలో దిగుబడి రాక చేతుకొచ్చి పంటకు ధర లేక రైతులు అప్పుల పాలు అవుతున్నారు.

దిగుబడి తగ్గింది..

ఐదు ఎకరాల్లో పత్తి పంట సాగు చేశాను. 30 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ప్రస్తుతం చూస్తే పెట్టుబడి డబ్బులు కూడా మీద పడేటట్లు ఉన్నాయి. ఎకరాకు 6 క్వింటాళ్ల పత్తి దిగుబడి రావడం తో పూర్తిగా నష్టపోయాను. ప్రభుత్వం మద్దతు ధర పెంచితే పెట్టిన పెట్టుబడి అయిన వస్తుందని ఆశ పడుతున్నాను.:- కుర్మా మల్లేష్ రైతు చిట్యాల


Similar News