నేరెల్ తండాలో గంజాయి పట్టి వేత

నియోజకవర్గంలోని గాంధారి మండలం నెరెల్ తండాలో రెండు రోజుల క్రితం నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం సీఐ స్వప్న ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు దాడి చేసి 1.14 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకునే క్రమంలో గంజాయి తరలిస్తున్న నిందితులు సిబ్బందిపై దాడిచేసి సినీ ఫక్కీలో పారిపోయారు.

Update: 2024-01-31 09:03 GMT

దిశ, ఎల్లారెడ్డి : నియోజకవర్గంలోని గాంధారి మండలం నెరెల్ తండాలో రెండు రోజుల క్రితం నిజామాబాద్ ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ బృందం సీఐ స్వప్న ఆధ్వర్యంలో పక్కా సమాచారం మేరకు దాడి చేసి 1.14 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకునే క్రమంలో గంజాయి తరలిస్తున్న నిందితులు సిబ్బందిపై దాడిచేసి సినీ ఫక్కీలో పారిపోయారు. ఈ మేరకు గంజాయిని స్వాధీనం చేసుకుని,

     దాడి చేసిన నిందితులపై గాంధారి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. త్వరలో పట్టుకోనున్నట్టు పోలీసులు తెలిపారు. పట్టుకున్న 1.14 కేజీల గంజాయిని ఎల్లారెడ్డి ఎక్సైజ్ కార్యాలయంలో అప్పగించినట్లు ఎక్సైజ్ సీఐ ఎండి. షాఖీర్ అహ్మద్ తెలిపారు. నిందితులు ధరావత్ రవీందర్, ధరావత్ బిచ్య, ధరావత్ మీరా బాయి, బస్తి జనార్ధన్ లపై కేసు నమోదు చేసినట్టు ఎక్సైజ్ సీఐ పేర్కొన్నారు.

అన్నసాగర్ శివారులో 460 గ్రాముల మత్తు పదార్థం పట్టివేత

ఇదిలా ఉండగా కామారెడ్డి డీటీ ఎఫ్ ,ఎల్లారెడ్డి ఎక్సైజ్ సిబ్బంది సంయుక్తంగా జరిపిన రూట్ వాచ్ లో అన్నసాగర్ శివారులో అనుమానంగా సంచరిస్తున్న వ్యక్తిని పట్టుకుని తనిఖీ చేయగా అతని వద్ద 460 గ్రాముల డైజోఫాం వంటి మత్తు పదార్థం ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఎరుపాజి మోగులగౌడ్ ను పట్టుకుని అరెస్ట్ చేసి జ్యూడీషియల్ రిమాండ్ కు తరలించినట్లు ఎక్సైజ్ సీఐ షా ఖీర్ అహ్మద్ తెలిపారు. రూట్ వాచ్ లో పాల్గొన్న వారిలో డీటీఎఫ్ సీఐ సుందల్ సింగ్, ఎల్లారెడ్డి ఎక్సైజ్ సీఐ, ఎస్ఐ జలీలోద్దిన్, సిబ్బంది పాల్గొన్నారు. 


Similar News