బస్టాండ్‌ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి

ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అధికారులను ఆదేశించారు.

Update: 2024-11-12 11:34 GMT

దిశ, ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణంలో నిర్మిస్తున్న బస్టాండ్, ప్రభుత్వ ఆస్పత్రి పనులను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే మదన్‌మోహన్ రావు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆస్పత్రి, బస్టాండ్ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో నిధులు లేక పనులు పూర్తి చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక బస్టాండ్, హాస్పిటల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసి పనులు పున:ప్రారంభించినట్లు తెలిపారు. రెండు నెలల్లో వాటిని అందుబాటులోకి తీసుకొస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కురుమ సాయిబాబా, మున్సిపల్ మాజీ ఛైర్మన్ కుడుముల సత్యనారాయణ, నాయకులు గోపికృష్ణ, వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News