బాధిత కుటుంబానికి విప్ గంప పరామర్శ
బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు.
దిశ, భిక్కనూరు : బాధిత కుటుంబాన్ని ప్రభుత్వ విప్ కామారెడ్డి శాసనసభ్యులు గంప గోవర్ధన్ ఆదివారం సాయంత్రం పరామర్శించారు. భిక్కనూరు మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన కాసాల గాలగౌడ్ అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవలే మృతి చెందడంతో, ఆయన కుమారుడు నర్సా గౌడ్ ను కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే 25వేల రూపాయలు ఆర్థిక సాయం కుటుంబ సభ్యులకు అందజేశాడు. కాగా సిద్ధ రామేశ్వర నగర్ కు చెందిన దుబ్బాక చాకలి రాంబాయి, మృతురాలి కుటుంబ సభ్యులకు మరో 10 వేల రూపాయల ఆర్థిక సాయం అందజేశాడు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ మల్లేష్ మల్లారెడ్డి, గ్రామ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సిద్ధరాంరెడ్డి, సొసైటీ వైస్ చైర్మన్ మద్ది స్వామి, సిద్ధరామేశ్వర నగర్ సర్పంచ్ జనగామ శ్రీనివాస్, రమేష్, గజ్వేల్లి భూమాలింగం, సిద్ధ రాములు, బోయిని బలరాం, నవీన్, తిర్మల్, గుడాల అనిల్, దండు అరుణ్ కుమార్, బాలయ్య, యాదగిరి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.