గాంధారి పోలీస్ స్టేషన్లో బండి సంజయ్ పై ఫిర్యాదు..

తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గాంధారి పోలీస్ స్టేషన్లో ఇంచార్జి ఎస్సై రాజారాం కు ఫిర్యాదు చేశారు.

Update: 2023-03-11 13:27 GMT

దిశ, గాంధారి : తెలంగాణ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ కామారెడ్డి, నిజామాబాద్ ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బండి సంజయ్ పై కఠిన చర్యలు తీసుకోవాలని శనివారం గాంధారి పోలీస్ స్టేషన్లో ఇంచార్జి ఎస్సై రాజారాం కు ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ మహిళల పట్ల ఇలా మాట్లాడడం ఎంత సిగ్గుచేటు అని, బండి సంజయ్ కవితకు క్షమాపణ చెప్పలేదంటే కనిపిస్తే చీపురులకు పనిచెప్పాల్సి వస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో గాంధారి మండల ఎంపీపీ రాధా బలరాం, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు, డీసీసీబీ డైరెక్టర్, గాంధారి సర్పంచ్ ఫోరం అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News