MLA Thota Lakshmi Kantarao : సీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం

ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి అపన్న హస్తంలా ఆదుకుంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు.

Update: 2024-10-29 09:32 GMT

దిశ,జుక్కల్ : ఆపదలో ఉన్న వారికి సీఎం సహాయనిధి అపన్న హస్తంలా ఆదుకుంటుందని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు (MLA Thota Lakshmi Kantarao )అన్నారు. మంగళవారం జుక్కల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన జుక్కల్ నియోజకవర్గంలోని పలువురు పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా మంజురైన.. సుమారు 165 మందికి ఆర్థిక సహాయాన్ని లబ్దిదారులకు చెక్కులను అందజేసినట్లు తెలిపారు. ప్రభుత్వం పేద ప్రజల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ పథకాన్ని అర్హులకు ఆధారంగా అందిస్తున్నట్లు వివరించారు. వేలాదిమంది పేద, మధ్య తరగతి ప్రజలకు సీఎం సహాయనిధి ద్వారా ఆర్థిక చేయూతనందించడం జరుగుతుందని తెలిపారు. నియోజకవర్గంలో వేలాదిమంది పేదలకు వైద్యం సేవల కోసం సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందించినట్లు చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా,ప్రజల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధతో ప్రజా ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో రమేష్ దేశాయ్,నిజాంసాగర్, మహమ్మద్ నగర్ మండలలా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఏలే. మల్లికార్జున్,రవీందర్ రెడ్డి, మద్నూర్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సాయి గౌడ్, బొంపల్లి రాజుల సెట్,కాంగ్రెస్ నాయకులు,అనీస్ పటేల్,గాండ్ల రమేష్,గుర్రపు శ్రీనివాస్,ప్రజా పండరి,మల్లయ్య గారి ఆకాష్, గంగి రమేష్,గుర్రపు వెంకటేశం,తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News