జుక్కల్లో కాంగ్రెస్ నాయకుల సంబరాలు

జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం బజరంగ్దళ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ యువకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు.

Update: 2023-12-03 09:19 GMT

దిశ, జుక్కల్ : జుక్కల్ మండల కేంద్రంలో ఆదివారం బజరంగ్దళ్ చౌరస్తా వద్ద కాంగ్రెస్ యువకులు టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. పది సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ముస్లిం నాయకులు సంబరాలు చేశారు. ప్రతి కాలనీలో చావడి దగ్గర సంబరాలు చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగేలా కాంగ్రెస్​ను గెలిపించినట్టు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఆరు పథకాలు ప్రతి వ్యక్తికి అందిస్తామని అక్కడి నేతలు పేర్కొన్నారు. 


Similar News