జిల్లా కేంద్రంలో వరుసగా పట్టుబడుతున్న గంజాయి

ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, నిజామాబాద్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ప్రోహిబిషన్, ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ వెంకటేష్,

Update: 2024-07-10 15:56 GMT

దిశ, నిజామాబాద్ సిటీ: ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్, నిజామాబాద్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు బుధవారం ప్రోహిబిషన్, ఎక్సైజ్, ఎన్ ఫోర్స్ మెంట్ విభాగం ఇన్స్పెక్టర్ వెంకటేష్, సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ నారాయణ రెడ్డి కానిస్టేబుళ్ళు భోజన్న, అవినాష్, విష్ణు బైపాస్ రోడ్డు, చంద్రశేఖర కాలనీ వద్ద అక్రమంగా గంజాయి రవాణా చేయుచున్నారనే సమాచారం మేరకు వారు కాపల వేయగ, ఇద్దరు వ్యక్తుల ద్విచక్ర వాహనం అనుమానాస్పదంగా సంచరిస్తున్నట్లు గ్రహించిన ఎక్సైజ్ సిబ్బంది అట్టి వాహనమును ఆపి తనిఖీ చేయగా ద్విచక్ర వాహనం ముందు భాగంలో ఒక ప్లాస్టిక్ సంచి ఉంది. అనుమానముతో విప్పి చూడగా అందులో ఒక ప్లాస్టిక్ కవర్లో 3 కిలోల (250) గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనపరచుకొని రవాణా చేస్తున్న ద్విచక్ర వాహనం హోండా షైన్ ను స్వాధీనపరచుకున్నట్లు అధికారులు తెలిపారు. పట్టుపడ్డ ముద్దాయిలలో నిజామాబాద్ నగరానికి చెందిన మిర్చి కాంపౌండ్ కు చెందిన బాబాఖాన్, సంగారెడ్డి జిల్లాకు చెందిన యతావత్ కిషన్ ను అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. వీరిని రిమాండు నిమిత్తం సయింధిత ప్రొహిబిషన్ ఎక్సైజ్ స్టేషన్ కు తరలించారు.


Similar News