ఆర్మూర్ లో గంజాయి పట్టివేత

ఆర్మూర్ లో పోలీసులు గంజాయి పట్టకున్నారు.

Update: 2024-03-02 15:13 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ లో పోలీసులు గంజాయి పట్టకున్నారు. ఆర్మూర్ ఎక్సైజ్ టీం డిచ్పల్లి రోడ్డు మార్గంలో గస్తీ నిర్వ హిస్తుండగా సీఎంసీ హాస్పిటల్ దేవుపల్లి సమీపంలో గంజాయి అమ్మకం చేస్తున్నారని సమాచారం వచ్చింది. దాంతో గార్గుల పవన్ కళ్యాణ్ బైక్​పై అనుమానాస్పదంగా కనిపించగా పట్టుకొని తనిఖీ చేయగా అతని వద్ద గంజాయి లభించగా పట్టుకుని అరెస్టు చేసినట్లు

    ఎక్సైజ్ ఆర్మూర్ సీఐ స్టీవెన్సన్ తెలిపారు. నిందితుడి వద్ద 170 గ్రాముల గంజాయిని సీజ్ చేశారు. నిజామాబాద్ లోని గృహకల్ప కాంప్లెక్స్, అసద్ బాబా నగర్, నందిగుట్ట వద్ద నుండి కొనుక్కొని గంజాయిని తీసుకువచ్చి ఇక్కడ ఎక్కువ రేటుకు అమ్ముతున్నానని తెలిపాడు. అలాగే నీరడి విజయ రాఘవ రాజు అనే వ్యక్తిని తనిఖీ చేయగా అతని వద్ద 100 గ్రాముల గంజాయి లభించింది. దాడుల్లో ఆర్మూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ స్టీవెన్సన్, సబ్ ఇన్స్పెక్టర్స్ ప్రమోద్ చైతన్య, చంద్రమౌళి, కానిస్టేబుల్స్ ధర్మేందర్ ,వికాస్, సందీప్, సాయిబాబా, గొల్ల శ్రీనివాస్, నరేష్, మోహన్ పాల్గొన్నారు.

Similar News