ఈపీఎఫ్ టూ జీపీఎప్ పెన్షన్ ఊసేలేదు..
తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరుగడంతో కరెంటోళ్లు సైతం సకల జనుల సమ్మె మొదలుకుని తెలంగాణ సాధనకు దీక్షలుచేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో పనిచేశారు.
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరుగడంతో కరెంటోళ్లు సైతం సకల జనుల సమ్మె మొదలుకుని తెలంగాణ సాధనకు దీక్షలుచేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో పనిచేశారు. తెలంగాణ ఏర్పడడంతో తమకష్టాలన్ని తీరాయని ఉమ్మడి రాష్ట్రంలో అమలుకు నోచుకుని ఉద్యోగులకు రావాల్సిన చట్టపరమైన హక్కులు వస్తాయని భావించిన వారికి నిరాశే ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన పీఆర్సీ గడువు ముగిసి నాలుగేళ్లయింది. 2022 ఏప్రిల్ 1 నాటికి పీఆర్సీ గడువు ముగియడంతో కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ దానిని అమలు విషయంలో యజమాన్యం చర్చలపేరిట కాలయాపనతో సరిపెట్టడంతో దశలవారి ఉద్యమాన్ని చేపట్టిన కరెంటోళ్లు ఏకంగా చలోవిద్యుత్ సౌదకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ అనగానే కరెంట్ శాఖలోని ఎన్పీడీసీఎల్, జెన్ కో ఉద్యోగులంతా కలిసి సమాలోచనలు నిర్వహించి మూడు నెలల క్రితం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. స్పందన లేకపోవడంతో రిలేనిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దాంతో దిగి వచ్చిన యజమాన్యం చర్చిస్తామనడంతో వెనక్కి తగ్గినా మళ్లీ వారికి నిరాశే ఎదురు కావడంతో చలోవిద్యుత్ సౌదకు పిలుపునిచ్చారు. అక్కడ కూడా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే సమ్మెకు వెళ్తామని తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రకటించింది.
విద్యుత్ శాఖలో 2022 ఏప్రిల్ 1తోనే పీఆర్సీ ముగిసింది. మరో వారం రోజులు గడిస్తే ఏడాదవుతున్నా కొత్త పీఆర్సీ ఊసే లేదు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ 2, జీపీఎఫ్ పెన్షన్ పై ఇంతవరకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ప్రకటన చేయలేదు. 2004 వరకు సంబంధిత పెన్షన్ కోసం విద్యుత్ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా పని చేసే ఆర్టిజన్ కార్మికులు తమకు ఎపీఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇటీవల కాలంలో ఆర్టిజన్ కార్మికులు నిరసనకు దిగారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ సైతం రిలేనిరాహార దీక్షల కోసం యజమాన్యానికి ఆల్టీమేటం జారీ చేసింది.
కానీ స్పందన లేకపోవడంతో ముందుగా మధ్యాహ్న భోజన విరామసమయంలో నిరసనలు నిర్వహించారు. యజమాన్యం నుంచి పిలుపురాకపోవడంతో నల్లబ్యాడ్జిలను ధరించి నిరసనలను కొనసాగించారు. చివరి అస్త్రంగా ఎన్పీడీసీఎల్, జెన్కో లోని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఆందోళనలు తీవ్రతరం పెంచాలని సన్నాహాక సమావేశాలను నిర్వహించారు. ఇటీవల వరంగల్ కార్పొరేట్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కరెంట్ ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికుల నుంచి ఎస్ఈ స్థాయి వరకు చలో విద్యుత్ సౌదకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 1500 మంది, కామారెడ్డి జిల్లాలో 780 మంది ఉద్యోగులు ఉన్నారు. అత్యవసర సేవలలో ఉండే వారిని మినహాయించి మిగిలిన అందరూ చలో విద్యుత్ సౌదకు తరలివెళతున్నట్లు ఉద్యోగ జేఏసీ ప్రకటించింది.
పీఆర్సీ గడువు ముగిసి ఏప్రిల్ 1కి నాలుగు సంవత్సరాలు పూర్తయింది. ఏడాది కాలంగా కొత్త పీఆర్సీ ఊసే లేకపోవడంతో ఉద్యోగుల ఆశలు నిరాశలయ్యాయి. అదేవిధంగా విద్యుత్ శాఖలో పెండింగ్ సమస్యల గురించి యజమాన్యానికి ఎన్నిసార్లు విన్నవించినా స్పందించలేదు. ప్రభుత్వం పట్టించుకోకపోవడం, యజమాన్యం నుంచి స్పందన లేకపోవడంతోనే కరెంటోళ్ల చలోవిద్యుత్ సౌదాను చేపట్టాం. ఇప్పటికి కూడా యజమాన్యం దిగిరాకపోతే సమ్మెకు వెనుకాడం.
ఈపీఎఫ్ టూ జీపీఎప్ పెన్షన్ ఊసేలేదు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్రం నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరుగడంతో కరెంటోళ్లు సైతం సకల జనుల సమ్మె మొదలుకుని తెలంగాణ సాధనకు దీక్షలుచేసి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో పనిచేశారు. తెలంగాణ ఏర్పడడంతో తమకష్టాలన్ని తీరాయని ఉమ్మడి రాష్ట్రంలో అమలుకు నోచుకుని ఉద్యోగులకు రావాల్సిన చట్టపరమైన హక్కులు వస్తాయని భావించిన వారికి నిరాశే ఎదురైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇచ్చిన పీఆర్సీ గడువు ముగిసి నాలుగేళ్లయింది. 2022 ఏప్రిల్ 1 నాటికి పీఆర్సీ గడువు ముగియడంతో కొత్త పీఆర్సీ కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. కానీ దానిని అమలు విషయంలో యజమాన్యం చర్చలపేరిట కాలయాపనతో సరిపెట్టడంతో దశలవారి ఉద్యమాన్ని చేపట్టిన కరెంటోళ్లు ఏకంగా చలోవిద్యుత్ సౌదకు పిలుపునిచ్చారు. విద్యుత్ శాఖ అనగానే కరెంట్ శాఖలోని ఎన్పీడీసీఎల్, జెన్ కో ఉద్యోగులంతా కలిసి సమాలోచనలు నిర్వహించి మూడు నెలల క్రితం ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చారు. స్పందన లేకపోవడంతో రిలేనిరాహార దీక్షలకు పిలుపునిచ్చారు. దాంతో దిగి వచ్చిన యజమాన్యం చర్చిస్తామనడంతో వెనక్కి తగ్గినా మళ్లీ వారికి నిరాశే ఎదురు కావడంతో చలోవిద్యుత్ సౌదకు పిలుపునిచ్చారు. అక్కడ కూడా తమకు ఉద్యోగ భద్రత కల్పించకపోతే సమ్మెకు వెళ్తామని తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ ప్రకటించింది.
విద్యుత్ శాఖలో 2022 ఏప్రిల్ 1తోనే పీఆర్సీ ముగిసింది. మరో వారం రోజులు గడిస్తే ఏడాదవుతున్నా కొత్త పీఆర్సీ ఊసే లేదు. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులకు ఈపీఎఫ్ 2, జీపీఎఫ్ పెన్షన్ పై ఇంతవరకు యాజమాన్యం కానీ ప్రభుత్వం కానీ ప్రకటన చేయలేదు. 2004 వరకు సంబంధిత పెన్షన్ కోసం విద్యుత్ ఉద్యోగులు చాలా కాలంగా ఎదురు చూస్తున్నారు. విద్యుత్ శాఖలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల మాదిరిగా పని చేసే ఆర్టిజన్ కార్మికులు తమకు ఎపీఎస్ ఈబీ రూల్స్ వర్తింపజేయాలని కోరుతున్నారు. ఈ విషయంలో ఇప్పటికే ఆలస్యం కావడంతో ఇటీవల కాలంలో ఆర్టిజన్ కార్మికులు నిరసనకు దిగారు. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెలంగాణ పవర్ ఎంప్లాయిస్ జేఏసీ సైతం రిలేనిరాహార దీక్షల కోసం యజమాన్యానికి ఆల్టీమేటం జారీ చేసింది. కానీ స్పందన లేకపోవడంతో ముందుగా మధ్యాహ్న భోజన విరామసమయంలో నిరసనలు నిర్వహించారు.
యజమాన్యం నుంచి పిలుపురాకపోవడంతో నల్లబ్యాడ్జిలను ధరించి నిరసనలను కొనసాగించారు. చివరి అస్త్రంగా ఎన్పీడీసీఎల్, జెన్కో లోని ఉద్యోగ సంఘాలన్నీ కలిసి ఆందోళనలు తీవ్రతరం పెంచాలని సన్నాహాక సమావేశాలను నిర్వహించారు. ఇటీవల వరంగల్ కార్పొరేట్ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం జరిగింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కరెంట్ ఉద్యోగులు, ఆర్టిజన్ కార్మికుల నుంచి ఎస్ఈ స్థాయి వరకు చలో విద్యుత్ సౌదకు పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లాలో 1500 మంది, కామారెడ్డి జిల్లాలో 780 మంది ఉద్యోగులు ఉన్నారు. అత్యవసర సేవలలో ఉండే వారిని మినహాయించి మిగిలిన అందరూ చలో విద్యుత్ సౌదకు తరలివెళతున్నట్లు ఉద్యోగ జేఏసీ ప్రకటించింది.