రోడ్లు ధ్వంసం చేసిన ఆగంతకులు
పల్లెసీమలంటే.. పచ్చని చెట్లు, చల్లని గాలులు ..అక్కడికి వెళ్లాలంటే నల్లని తాచుపాము లాంటి రోడ్...ఇవన్నీ ఒకప్పటి మాటలు. ప్రస్తుతం ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది.
దిశ,తాడ్వాయి : పల్లెసీమలంటే.. పచ్చని చెట్లు, చల్లని గాలులు ..అక్కడికి వెళ్లాలంటే నల్లని తాచుపాము లాంటి రోడ్...ఇవన్నీ ఒకప్పటి మాటలు. ప్రస్తుతం ఒక గ్రామానికి రోడ్డు వేయాలంటే ఎంతో ఖర్చుతో కూడుకున్నది. ప్రభుత్వం వెచ్చించిన డబ్బులతో గ్రామాల మధ్యబంధాలు మెరుగు పడాలంటే ప్రధాన భూమిక పోషించేది రహదారులే...అలాంటి రహదారినీ గుర్తుతెలియని వ్యక్తులు ఏకంగా 100 మీటర్ల మేర రోడ్డును దున్నేసిన ఘటన తాడ్వాయి మండలంలోని కంకల్ గ్రామ శివారులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే... తాడ్వాయి మండలంలోని కన్కల్ గ్రామ శివారులో పంచాయతీ రాజ్ శాఖ వారు వేసిన 100 మీటర్ల రోడ్డును దుండగులు ధ్వంసం చేయడంతో.. కన్కల్,అమర్లబండ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ఆ రెండు గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోడ్డు పై కేజవిల్స్ ట్రాక్టర్లు నడిపే వారిని పట్టుకొని జరిమాన విధించే అధికారులు ఏకంగా డంబార్ రోడ్డును ధ్వంసం చేసిన సంబంధిత అధికారులు ఏమీ తెలియనట్టు ఉండడం ఆయా గ్రామాల ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాల్సిందే. ఇదే విషయమై దిశ ప్రతినిధి పంచాయతీరాజ్ శాఖ డీఈ అధికారిని వివరణ కోరగా...రోడ్డు ధ్వంసం చేసిన విషయం వాస్తవమేనని అన్నారు. దానిపై పూర్తి విచారణ చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వం వెచ్చించిన ఖర్చుతో వేసిన రోడ్డును ధ్వంసం చేసిన వారిని శిక్షించే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.