నా పైనే చెయ్యేస్తారా.. నేనెవరనుకుంటున్నావ్.. పోలీసులపై బీఎస్పీ నేత
నాపైనే... చెయ్యేస్తారా...? నేనెవర నుకుంటున్నావ్... అంటూ తన రెక్క పట్టిన పోలీసులపై చిర్రెత్తాడు బీఎస్పీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దబచ్చ శ్రీధర్ రెడ్డి.
దిశ, భిక్కనూరు : నాపైనే... చెయ్యేస్తారా...? నేనెవర నుకుంటున్నావ్... అంటూ తన రెక్క పట్టిన పోలీసులపై చిర్రెత్తాడు బీఎస్పీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ అధ్యక్షులు పెద్దబచ్చ శ్రీధర్ రెడ్డి. పూర్తివివరాల్లోకి వెళితే సీఎం ఓ కార్యదర్శి స్మితా సబర్వాల్ మంగళవారం భిక్కనూరు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రంలో న్యూట్రిషన్ కిట్లను పంపిణీ చేస్తుంది. ఈ సందర్భంగా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పాలని సూచించగా, ఎక్కడో దూరంలో నిలుచున్న శ్రీధర్ రెడ్డి అక్కడికి చేరుకొని గత జనవరిలో జిల్లాకేంద్ర ఆసుపత్రిలో జరిగిన స్వీయ అనుభవాన్ని ఆమె దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా స్మితా సబర్వాల్ మాట్లాడుతూ ఇక్కడ ఈ విషయం మాట్లాడడం సబబు కాదని, మీతో తర్వాత మాట్లాడతానని, అప్పటివరకు ఓపికతో ఉండాలని చెప్పారు. దీంతో పోలీసులు రెట్టపై చేయి వేసి పక్కకు తీసుకెళ్లేప్రయత్నం చేయగా, ఒక్కసారిగా కోపంతో ఊగిపోయి నారెట్టే పడతావా అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగాడు. ప్రశాంతంగా జరుగుతున్న కార్యక్రమం ఒక్కసారిగా గొడవ పెరిగిపోవడంతో పోలీసులు రెట్టపట్టి ముందుకు తీసుకెళ్లారు. మేడం నాతో మాట్లాడతా అని చెప్పింది కదా...? అన్న వినిపించుకోకుండా నన్ను ముందుకు లాక్కెళ్తారా...? అంటూ పోలీసుల తీరుతో తీవ్ర స్థాయిలో ఫైరయ్యారు. పోలీస్ స్టేషన్ కు తరలించిన అనంతరం సాయంత్రం శ్రీధర్ రెడ్డిని విడుదల చేశారు.
పోలీసుల తీరుపై జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు..
తనను అవమానపరిచే విధంగా పోలీసులు వ్యవహరించారని మంగళవారం కామారెడ్డి జిల్లా ఎస్పీ, డీఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్పుకుంటున్న పోలీసులు, తనపై దౌర్జన్యం చేస్తూ గుండాలుగా వ్యవహరించిన వారిపై శాఖ పరమైన చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని శ్రీధర్ రెడ్డి డిమాండ్ చేశారు.