BREAKING: భయానకంగా గోదావరి ఉధృతి.. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిపివేత
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది.
దిశ, వెబ్‌డెస్క్: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో నిజామాబాద్ జిల్లాలోని గోదావరి నది (Godavari River) ఉగ్రరూపం దాల్చింది. దీంతో క్రమక్రమంగా వదర ఉధృతి పెరుగడంతో త్రివేణి సంగమం వద్ద పరిస్థతి భయానకంగా మారింది. ఇక కందకుర్తి దగ్గర శివాలయం పూర్తిగా నీట మునిగింది. మహారాష్ట్ర-తెలంగాణ (Maharastra - Telangana)ను కలిపే అంతరాష్ట్ర బ్రిడ్జిని అనుకుని గోదావరి భీకరంగా ప్రవహిస్తోంది. దీంతో అధికారులు, పోలీసులు రెండు రాష్ట్రాల మధ్య రాకపోకలు నిలిపివేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల ధాటికి విష్ణుపురి (Vishnupuri), గైక్వాడ్ (Gaikwad) ప్రాజెక్టులు నిండుకుండలా మారడంతో అధికారులు గేట్లను ఎత్తి దగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మరో 10 గంటల్లో గోదావరి వరద ఉధృతి మరింత పెరగనున్నట్లుగా సమాచారం.