పేదోడి గూడు కోసం మహా ధర్నా..

డబుల్ బెడ్ రూమ్ లో సాధనకై పేదోడి గూడు కోసం మహా ధర్నా కార్యక్రమం ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు.

Update: 2023-03-02 16:48 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డబుల్ బెడ్ రూమ్ లో సాధనకై పేదోడి గూడు కోసం మహా ధర్నా కార్యక్రమం ఈ నెల 4న నిర్వహిస్తున్నట్లు బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. గురువారం నగరంలోని తన కార్యాలయంలో పేదోడి గూడు కోసం మహా ధర్నా పోస్టర్ ను బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యవర్గ సభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ టీఆర్ఎస్ పాలనలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు నిజామాబాద్ నగర ప్రజలకు ఒక డబ్బులు బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని అన్నారు. డబుల్ బేడ్ రూం ఇండ్ల మంజూరు చేయాలని పేద మధ్య తరగతి అర్హులైన నిరుపేదలకు, ఇవ్వాలని ఆలోచనతోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 4వ తేదీన ధర్నా చౌక్ లో ఎన్టీఆర్ చౌరస్తా దగ్గర మహా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా భారతీయ జనతా రాష్ట్ర నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు కొండా విశ్వేశ్వర్ రెడ్డి రానున్నారని ఆయన తెలిపారు. నగర ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ అవకాశం కల్పించాలి గద్దెనెక్కిన ప్రజా ప్రతినిధులు ప్రజలను పట్టించుకోకుండా ప్రారంభోత్సవాల వెంట తిరుగుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రజా సమస్యలు తెలుసుకోవాలి డబుల్ బెడ్ రూమ్లను మంజూరు చేయాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి వేలాదిగా నగర ప్రజానికం రావాల్సిందిగా సూర్యనారాయణ కోరారు.

భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామన్నారు. డబుల్ బెడ్ రూమ్ ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ ఉద్యమ రూపు దాలుస్తదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు నాగొల్ల లక్ష్మీనారాయణ, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు శివప్రసాద్, బిజెపి నాయకులు వినోద్ రెడ్డి, రోషన్లాల్ బోర, మీసేవ శ్రీనివాస్, ఇప్పకాయల కిషోర్, బద్దంకిషన్, మఠం పవన్, దొంతుల రవి, భాస్కర్, హరీష్ రెడ్డి, ఎడ్ల బాలకృష్ణ, పోలీస్ శ్రీనివాస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News