అభివృద్ధి అని చెప్పి అవినీతి చేశారు.. బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ

Update: 2023-11-27 14:02 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నగరంలో అభివృద్ధి కన్నా అవినీతి ఎక్కువ జరిగిందని, కేంద్రంలో మోదీ ప్రభుత్వ పథకాలలో ఒక్క రూపాయి అవినీతి లేదని కానీ రాష్ట్రంలో ప్రతిదీ అవినీతితో బ్రష్టు పట్టించారని బీజేపీ అభ్యర్థి ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. సోమవారం నగరంలోని 42 వ డివిజన్‌లోని గాంధీ చౌక్‌లో మహిళా మోర్చా నాయకులు మహిళా సోదరిమనులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా సినీ నటి కవిత హాజరయ్యారు. శివాజీ చౌక్‌లో స్ట్రీట్ కార్నర్ మీటింగ్‌కి ముఖ్య అతిధిగా చికోటి ప్రవీణ్ హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. నగరంలో బిగాల గణేష్ 9 సంవత్సరాల నుండి ఏమి చేయలేదన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు ఎందుకు పూర్తి చేయలేదని, కట్టిన డబుల్ బెడ్ రూమ్‌లు ఎందుకు పేదలకు అందచేయలేదని ప్రశ్నించారు. ప్రజలు తెలివైన వాళ్ళు అన్ని గమనిస్తున్నారని, నగరాన్నిపీఎఫ్ఐ, గంజాయికి అండగా మార్చి యువకులను చెడగొడుతున్నారని ఆరోపించారు. యువతకు ఉద్యోగ అవకాశలు లేక వేరే దేశాలు ప్రయాణం అవుతున్న ఇక్కడ ఎవరు పట్టించుకోలేదన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ వస్తే అభివృద్ధి పరుగులు పెడ్తుందన్నారు.


ప్రభుత్వ పాఠశాల పరిస్థితి దారుణం ఉందని, బీజేపీ ప్రభుత్వం రాగానే ఉచిత విద్య, ఉచిత వైద్యం, అమలు చేస్తామన్నారు. దార్మిక కార్యక్రమంలో నేను ఎల్లప్పుడూ ముందు ఉన్నానని, మీ లో ఒకడిగా ఉంటూ ప్రజా సమస్యల మీద పోరాడానన్నారు. అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడం నా లక్ష్యం అన్నారు. మైనార్టీలకు బీజేపీ ఎంతో అండగా నిలిచిందన్నారు. కొత్త రేషన్ కార్డులు అందచేయలేదన్నారు. కొత్త పెన్షన్‌లు ఇవ్వలేని పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఆయుష్మాన్ భారత్ అన్ని వర్గాల ప్రజలకు ఒకే విధమైన ద్వారా అండగా ఉందని అన్నారు. ఒక్కసారి రాష్ట్రంలో బీజేపీకి కమలం పువ్వు కు ఓటేసి నగరంలో నన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, ఫ్లో్ర్ లీడర్ గోపిడి స్రవంతి రెడ్డి, అసంబ్లీ కన్వీనర్ పంచారెడ్డి లింగం, ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ, కార్పొరేటర్లు పంచారెడ్డి ప్రవళిక శ్రీధర్, ఏలేటి సిద్దార్థ్ రెడ్డి, మాస్టర్ శంకర్, ఎర్రం సుదీర్, బూరుగుల ఇందిరా వినోద్, చందుపట్ల వనిత శ్రీనివాస్, మెట్టు విజయ్, సుక్క మధు, ఇప్పకాయల వనిత కిషోర్, బంటు వైష్ణవి రాము, పంచారెడ్డి లావణ్య, మండల అధ్యక్షులు పుట్ట వీరేందర్, గడ్డం రాజు, రోషన్ లాల్ బోర, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.


Similar News