నంబర్ ప్లేట్ లేని బైకులు సీజ్

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డిచ్ పల్లి సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో జక్రంపల్లి ఎస్ఐ, సిబ్బంది నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

Update: 2024-02-08 12:31 GMT

దిశ, జక్రాన్ పల్లి : నిజామాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు డిచ్ పల్లి సీఐ మల్లేష్ ఆధ్వర్యంలో జక్రంపల్లి ఎస్ఐ, సిబ్బంది నంబర్ ప్లేట్ లేని వాహనాలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 9 ద్విచక్ర వాహనాలను సీజ్ చేసి, వాహన దారులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ మేరకు ఎస్సై తిరుపతి పేర్కొన్నారు. నేరస్తులు నంబర్ ప్లేట్ లేని వాహనాలతో స్నాచింగ్, దొంగతనాలు, ఇతర నేరాలకు పాల్పడుతున్నారని, ప్రతి ఒక్కరూ తప్పక రోడ్డు భద్రత నియమాలను పాటించాలని, హెల్మెట్ ను ధరించాలని కోరారు.


Similar News