ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించాలి
ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.
దిశ,బాన్సువాడ : ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ తప్పక ధరించాలని మంత్రి జూపల్లి కృష్ణారావు సూచించారు.హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. బాన్సువాడ పట్టణంలో జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల ర్యాలీని వ్యవసాయ సలహాదారు, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డితో కలిసి జెండా ఊపి మంగళవారం ఆయన ప్రారంభించారు. మంత్రికి, ఎమ్మెల్యే కు రవాణా శాఖ అధికారులు హెల్మెట్లను అందజేశారు. కార్యక్రమంలో ఆగ్రో ఇండస్ట్రీస్ ఛైర్మన్ కాసుల బాలరాజ్, జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీనివాస రెడ్డి, పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.