ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ అవిశ్వాస తీర్మానంపై బిగ్ ట్విస్ట్

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాసంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది.

Update: 2024-02-09 13:57 GMT

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ పై అవిశ్వాసంలో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. శుక్రవారం ఆమె వ్యతిరేకవర్గం మున్సిపల్ కౌన్సిలర్లు ఆర్మూర్ ప్రాంతంలోని సోషల్ మీడియా గ్రూపుల్లో పోస్టులు చేస్తున్నారు. ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్​ పండిత్ వినీత పవన్ పై వ్యతిరేక వర్గం హై కోర్టు ను ఆశ్రయించినట్టు తెలుస్తుంది. గతంలోనే చైర్ పర్సన్ వేసిన స్టే పిటిషన్ ను రాష్ట్ర హైకోర్టు కొట్టి వేయడంతో పాటు, అవిశ్వాస తీర్మానం నెగ్గింది అని స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది.

    అయినా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో తిరిగి మున్సిపల్ చైర్ పర్సన్ గా పండిత్ వినీత పవన్ బాధ్యతలు తీసుకోవడంపై ధర్మాసనం ఆగ్రహించినట్లు పోస్టులు పెడుతున్నారు. ఈ నెల 19 లోపు ఆర్మూర్ మున్సిపల్ నూతన చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాలని, ఆలోగా వైస్ చైర్మన్ కు ఇన్చార్జ్ చైర్మన్ గా బాధ్యతలు ఇవ్వాలి అంటూ రాష్ట్ర హైకోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు మున్సిపల్ చైర్ పర్సన్ పండిత్ వినీత పవన్ వ్యతిరేక వర్గం మున్సిపల్ కౌన్సిలర్లు పోస్టులు పెడుతున్నారు. ఏది ఏమైనా రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఆర్డర్ కాపీలు బయటకు వచ్చిన తర్వాతే పూర్తిస్థాయి నిజానిజాలు బయటకు తెలిసే అవకాశం ఉంది. దీనిపై పట్టణ ప్రజలు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.


Similar News