బెల్ట్ షాపు అడ్డాగా పేకాట క్లబ్

గ్రామాలలో మద్యం దుకాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి.

Update: 2024-01-17 14:39 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : గ్రామాలలో మద్యం దుకాణాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారాయి. ఏడాదికి లక్షల్లో వేలం పాటలో బెల్ట్ షాపులను దక్కించుకున్న నిర్వాహకులు ఇల్లీగల్ కార్యకలాపాలను చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం బాద్గుణ గ్రామంలో అక్రమంగా నిర్వహిస్తున్న బెల్ట్ షాప్ కేంద్రంగా పేకాట క్లబ్ గత కొంతకాలంగా నిర్వహిస్తున్నారు.

    ఈ విషయంలో స్థానికులు డయల్ 100 కు సమాచారం అందించారు. దాంతో బుధవారం నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ రాజశేఖర్ రాజ్, సీఐ అంజయ్య ఆధ్వర్యంలో సిబ్బంది గ్రామంలోని నాగిరెడ్డి అనే వ్యక్తి నిర్వహిస్తున్న బెల్టుషాపుపై దాడి నిర్వహించారు. ఈ దాడిలో 40 వేల మద్యం పట్టుబడింది. అంతే కాకుండా అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 23,340 స్వాధీనం చేసుకున్నారు. బెల్ట్ షాపు నిర్వాకుడు నాగిరెడ్డి తో పాటు మరో ఏడుగురిని అరెస్టు చేసి నందిపేట పోలీసులకు అప్పజెప్పారు. 


Similar News