'కాంగ్రెస్ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా ?'

కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినంక పార్టీ మారమని గ్యారెంటీ ఇస్తారా అని బాల్కొండ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు.

Update: 2023-11-13 14:57 GMT

దిశ, ఆర్మూర్ : కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలుగా గెలుపొందినంక పార్టీ మారమని గ్యారెంటీ ఇస్తారా అని బాల్కొండ ఎమ్మెల్యే బీజేపీ అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ అన్నారు. అదేవిధంగా బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి, అతని సోదరుడు యువతను గంజాయికి బానిసలుగా చేస్తుండ్రని అన్నపూర్ణమ్మ ఆరోపించి ఆగ్రహం వెలిబుచ్చి మండిపడ్డారు. బాల్కొండ నియోజకవర్గంలోని భీంగల్ మండలం బాబానగర్, మెండోరా గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే, బాల్కొండ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఏలేటి అన్నపూర్ణమ్మ సోమవారం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అన్నపూర్ణమ్మ మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో కారుగుర్తుకు ఓటు వెయ్యకపోతే పెన్షన్లు తీసేస్తామని మహిళలను భయందోళనకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. పెన్షన్లు తీసివేసే దమ్ము ధైర్యం ఎవ్వరికి లేదని బీజేపీని గెలిపిస్తే అర్హులందరికీ పెన్షన్లు వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రంలో డబల్ ఇంజిన్ సర్కార్ వస్తే ప్రతీ వ్యక్తికి న్యాయం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గెలిస్తే పార్టీ మారమని గ్యారంటీ ఇస్తారా అని విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న అవినీతి అక్రమాలను రూపుమాపాలంటే బాల్కొండలో తప్పకుండా బీజేపీని గెలిపించాలని కోరారు. మంత్రి ప్రశాంత్ రెడ్డి ప్రతీ పనిలో 30% కమీషన్ తీసుకున్నాడని విమర్శించారు. బాల్కొండలో బీజేపీని గెలిపిస్తే అర్హులందరికీ ఇండ్లు, పెన్షన్లు, రేషన్ కార్డులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. బాల్కొండలో బీజేపీకి ఒక్కసారి అవకాశం ఇస్తే ఎప్పుడు చూడనంత అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ మేనిఫెస్టోలో కొత్తగా 400/-కే సిలిండర్ ఇస్తామని చెప్తున్నారని, ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ఇయ్యనిది మళ్ళి గెలుస్తే ఇస్తామనడం కేసీఆర్ అసమర్ధ పాలనకు నిదర్శనమని విమర్శించారు. బాల్కొండలో బీజేపీని గెలిపిస్తే మరెన్నో అభివృద్ధి పనులు చేస్కోవచ్చని ధీమా వ్యక్తం చేశారు.

అనంతరం బీఆర్ఎస్ పార్టీకి చెందిన కమ్మర్ పల్లి సొసైటీ మాజీ వైస్ చైర్మన్ నల్ల మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీకి చెందిన కమ్మర్ పల్లి రైతుసమన్వయ సమితి డైరెక్టర్ యాల్ల మురళి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సోమా నరేష్, పలువురు రైతులు యువకులు, మెండోరా మండలం వెల్గటూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ సోము విద్యాసాగర్, భీంగల్ మండలం బెజ్జోరా గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు అన్నపూర్ణమ్మ సమక్షంలో బీజేపీలో పార్టీలు చేరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏలేటి మల్లికార్జున్ రెడ్డి, అసెంబ్లీ కన్వీనర్ మల్కాన్నగారి మోహన్, జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మల శ్రీనివాస్, మండల అధ్యక్షులు ములిగే మహిపాల్, భూమన్న, వేణు, గంగాధర్, నాగార్జున్ రెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News