ఔరేక్ బార్ మోడీ సర్కార్

ఔరేక్ బార్ మోడీ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ జహిరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు.

Update: 2024-02-03 11:39 GMT

దిశ, బాన్సువాడ : ఔరేక్ బార్ మోడీ సర్కార్ అని భారతీయ జనతా పార్టీ జహిరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటేపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం కేంద్రంలో పార్లమెంటు ఎన్నికల్లో భాగంగా ఆయన బీర్కూర్ మండల కేంద్రంలో కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత

     దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాలనను ప్రపంచ దేశాలు గర్విస్తున్నాయని అన్నారు. దేశ ప్రజలు సైతం మూడోసారి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరుస్తున్నారని తెలిపారు. బీజేపీ గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల మాదిరిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ అధ్యక్షురాలు అరుణ తార, మండల ఇంచార్జీ, జిల్లా కార్యవర్గ సభ్యులు నాగేళ్ల సాయి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News