ఘనంగా భగలాముఖి పీఠంలో అష్టమి పూజ

ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలోని ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న బగలాముఖి పీఠంలో శనివారం అమ్మవారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని అష్టమి పూజ నిర్వహించారు

Update: 2024-11-09 15:40 GMT

దిశ ,ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలోని ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న బగలాముఖి పీఠంలో శనివారం అమ్మవారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని అష్టమి పూజ నిర్వహించారు. పీఠం నిర్వాహకులు క్రాంతి పటేల్ ఆధ్వర్యంలో.. ఉదయం నుంచి వివిధ పండ్ల రసాలతో అభిషేకాలు ,అర్చనలు నిర్వహించి ..మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రాంతి పటేల్ మాట్లాడుతూ.. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన భక్తులతో పాటు.. తెలంగాణ లోని వివిధ జిల్లాలు, మండలాలకు చెందిన భక్తులు స్థానికులు సంతోష్, మరుమల్ల వెంకన్న, రేవంత్ అప్ప, తదితరులు పాల్గొన్నారు.ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలోని ఆర్టీసీ బస్ డిపో పక్కన ఉన్న బగలాముఖి పీఠంలో శనివారం అమ్మవారి జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకొని అష్టమి పూజ నిర్వహించారు


Similar News