DEO : చార్జి తీసుకోనున్న డీఈఓ అశోక్..

నిజామాబాద్‌ జిల్లా విద్యాధికారి (డీఈవో) గా కొత్తగా బదిలీ పై వచ్చిన అశోక్ బుధవారం చార్జీ తీసుకోనున్నారు.

Update: 2024-11-06 04:25 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్‌ జిల్లా విద్యాధికారి (డీఈవో) గా కొత్తగా బదిలీ పై వచ్చిన అశోక్ బుధవారం చార్జీ తీసుకోనున్నారు. ఇదివరకు నిజామాబాద్ డీఈవోగా ఉన్న ఎన్.వి దుర్గాప్రసాద్‌ ను ఉన్నతాధికారులు మోడల్ స్కూల్స్ డిప్యూటీ డైరెక్టర్ గా నియమించడంతో ఆయన స్థానం లోకి అశోక్ వచ్చారు. ఈయన ఆసిఫాబాద్‌ జిల్లా విద్యాధికారిగా పనిచేశారు. అక్కడి నుంచి ఉన్నతాధికారులు అశోక్ ను నిజామాబాద్ ఎఫ్ఏసీ డీఈఓగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అశోక్ కు నిజామాబాద్ జిల్లాతో అనుబంధం ఉంది. నిజామాబాద్ డైట్ కళాశాలలో అధ్యాపకుడిగా ఆయన సుదీర్ఘకాలం పాటు పనిచేశారు. గణిత శాస్త్రం, ఐఐటీ విద్య పై ఆయనకు మంచి పట్టు ఉందని జిల్లా విద్యాశాఖ వర్గాలు తెలిపాయి.

Tags:    

Similar News