Armor municipal : ఆర్మూర్ మున్సిపల్ కు బదిలీ పై 11 మంది ఉద్యోగుల రాక..

ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి బదిలీ పై 11 మంది ఉద్యోగులు బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కు వచ్చారు.

Update: 2024-07-24 10:57 GMT

దిశ, ఆర్మూర్ : ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయానికి బదిలీ పై 11 మంది ఉద్యోగులు బుధవారం ఆర్మూర్ మున్సిపల్ కు వచ్చారు. ఈ సందర్భంగా బదిలీ పై వచ్చిన ఆర్మూర్ మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ గజానంద్, ఆర్వో ఉమాదేవి, ముగ్గురు జూనియర్ అసిస్టెంట్లు, ఏడుగురు బిల్ కలెక్టర్లు మున్సిపల్ కార్యాలయంలోని కమిషనర్ చాంబర్లో కమిషనర్ రాజును కలిసి మర్యాదపూర్వకంగా పుష్పగుచ్చాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ రాజు బదిలీ పై వచ్చిన నూతన అధికారులతో మాట్లాడారు. బదిలీ పై వచ్చిన ఉద్యోగులందరూ మీమీ విధుల్లో ఎలాంటి రాజకీయాలకు తావు లేకుండా పనులు చేయాలన్నారు. నూతన ఉద్యోగుల పనులతో ఆర్మూర్ మున్సిపల్ కు మంచి గుర్తింపు రావాలని కమిషనర్ వారికి సూచించారు.

Tags:    

Similar News