ఉపాధి దొరక్క అలా చేశారు..

జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దొంగలుగా మారిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు.

Update: 2022-10-13 15:55 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : జల్సాలకు అలవాటు పడి ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దొంగలుగా మారిన ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ వెంకటేశ్వర్ తెలిపారు. గురువారం డిచ్ పల్లి సీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ వివరాలు వెల్లడించారు. నందిపేట్ మండలం కొండూర్ కు చెందిన బంగారు రాజు, నిజామాబాద్ నగరంలోని గాయత్రినగర్ కు చెందిన రాజేశ్ లు కార్పొరెంటర్ గా పని చేస్తూ జీవిస్తున్నారు.

ఇటీవల కాలంలో పనులు సరిగ్గా దొరకకపోవడంతో ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. దానికి తోడు జల్సాలకు కూడా అలవాటుపడ్డారు. ఎలాగైనా డబ్బులు సంపాదించాలని దొంగతనాలు చేయాలని నిర్ణయించారు. గత నెల 30న డిచ్ పల్లి మండలం మిట్టాపల్లిలో ఓ ఇంట్లో చోరి చేశారు. అదే మాదిరిగా ఆర్మూర్ లోని పెర్కిట్ లో దొంగతనానికి పాల్పడ్డారు.

గురువారం డిచ్ పల్లి రైల్వే స్టేషన్ వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా ఇద్దరిని పట్టుకుని విచారించగా రెండు దొంగతనాలు తామే చేసినట్లు ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. ఇద్దరి వద్ద నుంచి 11 తులాల బంగారు ఆభరణాలు, 13 తులాల వెండి, 3 లక్షల 30 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఏసీపీ తెలిపారు. ఈ కేసును ఛేదించడంలో డిచ్ పల్లి సీఐ మోహన్, డిచ్ పల్లి ఎస్సై శ్రీకాంత్, జక్రాన్ పల్లి ఏఎస్సై హబీబ్, మహ్మద్ సిబ్బందిని ఏసీపీ అభినందించారు.

Tags:    

Similar News