బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలి : ఆర్మూర్ ఎమ్మెల్యే
నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గంలోని ఆర్మూర్ మండలం
దిశ,ఆర్మూర్ : ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి స్వగృహంలో బీజేపీ క్రియాశీల సభ్యత్వాన్ని శుక్రవారం తీసుకున్నారు. అదే విధంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి పల్లె గంగారెడ్డి కూడా బిజెపి క్రియాశీల సభ్యత్వాన్ని తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సభ్యత్వం నమోదులో చురుకుగా పాల్గొని బీజేపీ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి, క్రియాశీల సభ్యత్వం నమోదు ఇంఛార్జి కలిగొట్ల గంగాధర్, బీజేపీ కార్యదర్శి చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు.