గుంటూరు కారం చిత్రంపై మరో వివాదం

మహేష్ బాబు కథానాయకుడిగా విడుదలైన గుంటూరుకారం సినిమాలో విలన్స్ కు మార్క్స్,లెనిన్ పేర్లు పెట్టి వారి పాత్రలను చెడుగా చూపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు.

Update: 2024-01-16 10:43 GMT

దిశ, నిజామాబాద్ సిటీ : మహేష్ బాబు కథానాయకుడిగా విడుదలైన గుంటూరుకారం సినిమాలో విలన్స్ కు మార్క్స్,లెనిన్ పేర్లు పెట్టి వారి పాత్రలను చెడుగా చూపెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అన్నారు. అదే విధంగా అసభ్యకరంగా రాసిన మడత కుర్చీ బూతు పాటని తక్షణమే సినిమాలో నుండి తొలగించాలని , సినిమా డైరెక్టర్ త్రివిక్రమ్ కు మతి భ్రమించిందని అన్నారు. ప్రపంచ కమ్యునిస్టు విప్లవకారులు మార్క్సిస్ట్

    మహోపాధ్యాయుల పేర్లను ఈ సినిమాలో విలన్స్ కి పెట్టి సమాజానికి తప్పుడు అవగాహన కల్పించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, కారల్ మార్క్స్ ప్రపంచానికి కమ్యూనిజాన్ని పరిచయం చేసిన వ్యక్తి అన్నారు. అలాంటి మహానేతల పేర్లని గుంటూరుకారం సినిమాలో విలన్స్ కి పెట్టడం తీవ్రమైన అభ్యంతరకరం అన్నారు. అలాగే సినిమాలో అసభ్యకరంగా రాసిన మడతకుర్చీ బూతు పాటను పెట్టడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు. డైరెక్టర్ త్రివిక్రమ్, హీరో మహేష్ బాబు భేషరతుగా బహిరంగ క్షమాపణలు చెప్పి వీటిని తొలగించాలని కోరారు. 


Similar News