ZPTC FundS : జెడ్పీటీసీ నిధులు మూడు లక్షలు వెనక్కి వెళ్ళాయా..?

అంగన్వాడి స్కూల్ మరమ్మత్తుల కోసం జడ్పీటీసీ నిధుల నుండి మూడు లక్షలు రూపాయలు మంజూరు చేశారు.

Update: 2024-07-21 11:14 GMT

దిశ, గాంధారి : అంగన్వాడి స్కూల్ మరమ్మత్తుల కోసం జెడ్పీటీసీ నిధుల నుండి మూడు లక్షలు రూపాయలు మంజూరు చేశారు. అయితే గ్రామస్తులు అందరూ కలిసి ఆ భవనాన్ని పూర్తిగా కూల్చివేసి ఆ స్థలంలోనే నూతన అంగన్వాడి భవనాన్ని నిర్మించాలని గ్రామస్తులు అనుకున్నారు. ఆరేళ్ల నుండి 600 రూపాయలు అద్దె కడుతూ అంగన్వాడి స్కూల్ నడిపిస్తు వస్తున్నారు. పూర్తివివరాల్లోకి వెళితే కామారెడ్డి జిల్లా గాంధారి మండలం నేరెల్ తండా గ్రామంలో చోటుచేసుకుంది. ఇంతకుముందు అంగన్వాడి కేంద్రాలు రెండు ఉండడంతో ఒకటి స్కూల్ వద్ద నడిపించడంతో ఇంకో అంగన్వాడి భవనం పూర్తిగా పెచ్చులూడుతూ శిధిలావస్థకు చేరుకుంది.

600 రూపాయలతో అద్దె కడుతూ అంగన్వాడి నిర్వహణ..

ఆరు సంవత్సరాల నుండి అంగన్వాడి కేంద్రానికి 600 రూపాయలు నెలకు అద్దె చొప్పున చెల్లిస్తూ కాలం వెళ్లదీస్తున్నారు. అయితే దీనికి మాత్రం శాశ్వత పరిష్కారం రాకపోవడం పట్ల గ్రామస్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు మరమ్మత్తులు నిర్మాణం కోసం మూడు లక్షల రూపాయలు జెడ్పీటీసీ నిధుల ద్వారా మంజూరు అయినవి అన్ని కానీ మరమ్మత్తులు జరపకుండా పూర్తిగా పాత భవనాన్ని కూల్చివేసి కొత్త భవనం కోసం నిధులు మంజూరు చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

ఐసీడీఎస్ ద్వారా నిధులు మంజూరు అయ్యాయి ఇంచార్జ్ సూపర్వైజర్ పద్మ..

గత ఆరు సంవత్సరాల నుంచి అంగన్వాడి అద్దె కడుతూ కొనసాగుతున్న తరుణంలో ఐసీడీఎస్ ద్వారా అంగన్వాడీ భవనానికి నిధులు మంజూరు అయినట్లు ఐసీడీఎస్ ఇంచార్జ్ పద్మ దిశకు తెలిపారు. అయితే నిధులు మంజూరు అయినా కాంట్రాక్టర్ కోసం టెండర్ ప్రక్రియ రూపొందించుకుంటుందని త్వరలోనే విద్యార్థులకు నూతన అంగన్వాడి భవన నిర్మాణం చేపడతామని తెలియజేశారు.

మూడు లక్షల రూపాయలు వెనక్కి వెళ్లాయి : మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్

అంగన్వాడి స్కూల్ మరమ్మత్తుల కోసం జెడ్పీటీసీ నిధుల ద్వారా మూడు లక్షలు మంజూరు అయినప్పటికీ గ్రామస్తులు అందరూ నూతన భవనం ఏర్పాటు చేసుకుంటామని, మరమ్మత్తులు మాత్రం వద్దని చెప్పడంతో వచ్చిన మూడు లక్షల నిధులను వెనక్కి పంపించామని మాజీ జెడ్పీటీసీ శంకర్ నాయక్ అన్నారు.

Tags:    

Similar News