రేపు అలీసాగర్ నీటి విడుదల

అలీసాగర్ ఎత్తిపోతల ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు శుక్రవారం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండలంలోని కోస్లీ గోదావరి వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేయనున్నారు.

Update: 2024-08-29 10:52 GMT

దిశ, నవీపేట్ : అలీసాగర్ ఎత్తిపోతల ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంటలకు శుక్రవారం మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మండలంలోని కోస్లీ గోదావరి వద్ద గల పంప్ హౌస్ లో మోటార్లను స్టార్ట్ చేసి నీటిని విడుదల చేయనున్నారు. ఈమేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిపాల్ రెడ్డి తెలిపారు. నవీపేట్, రెంజల్, ఎడపల్లి, నిజామాబాద్, డిచ్ పల్లి మండలాల రైతులకు సాగునీటిని అందించే అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ నుండి నీటిని విడుదల చేస్తుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

Tags:    

Similar News