murder : అప్పు తీసుకొని..6 తులాల బంగారం ఇస్తానని చెప్పి..చివరికి ఏం చేశాడో చూడండి

కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని లింగంపల్లి శివారులో దారుణం చోటు చేసుకుంది.

Update: 2024-11-04 15:04 GMT

దిశ, గాంధారి/సదాశివనగర్: కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండల కేంద్రంలోని లింగంపల్లి శివారులో దారుణం చోటు చేసుకుంది. తలపై బండరాయితో మోది హత్య చేసిన సంఘటన అందరినీ కలచివేసింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి మొదటగా మృతదేహాన్ని గుర్తించేందుకు సామాజిక మాధ్యమాల ద్వారా మృతదేహ చిత్రాలను,మృతుడి చేతి పైన ఉన్న అమ్మ అనే పచ్చబొట్టుతో ఎట్టకేలకు మృతుడి బంధువులు డిచ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కృష్ణగా గుర్తించడం జరిగింది. హత్య ఎలా జరిగింది అనే వివరాలు ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు కృష్ణ గంగాధర్ అనే వ్యక్తిని కలిసి వస్తానని చెప్పాడని మృతుడి భార్య తెలిపింది. దీంతో పోలీసులు గంగాధర్ పై అనుమానంతో పోలీస్ స్టేషన్ కు తీసుకువచ్చి కూపి లాగగా గంగాధర్ హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అర్గుల్ పని వద్ద పరిచయస్తులైన మృతుడు కృష్ణ, మృతుని భార్య లావణ్య లింగంపేట్ మండలం కోర్పోల్ గ్రామానికి చెందిన గంగాధర్ తో పరిచయం . దీంతో యోగక్షేమాలు ఒకరికొకరు పంచుకునేవారు. అయితే కొన్ని రోజుల తర్వాత గంగాధర్ బ్రతుకుతెరువు కోసం దుబాయ్ వెళ్లి 2019 వ సంవత్సరం ఆగస్టు నెలలో తిరిగి రావడం జరిగింది. దుబాయ్ వెళ్లి సంపాదించిన డబ్బులు అయిపోగా మరల దుబాయ్ వెళ్తా అని గంగాధర్ కృష్ణతో మాట్లాడి ఏజెంట్ ను కలిసి డబ్బు కోసమై ఇలా చేయాలో తెలియని పరిస్థితిలో గంగాధర్, కృష్ణ తో మీ భార్య బంగారం దుబాయ్ వెళ్లేందుకు ఇస్తే వాటిని నేను దుబాయ్ నుండి వచ్చిన తర్వాత తులంకు తులం నర బంగారం ఇస్తానని చెప్పి మొత్తం నాలుగు తులాల బంగారం తీసుకొని..మొత్తం ఆరు తులాల బంగారం కొనిస్తానని నమ్మించి.. బంగారంను అమ్ముకొగా వచ్చిన డబ్బులను ఇంటికి తెచ్చుకొని జల్సా లు చేశాడు. ఈ ఇద్దరిని చంపేస్తే ఈ బంగారం డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని పథకం ప్రకారం.. కృష్ణ ని కూడా దుబాయ్ తీసుకెళ్తానని ఇంటి డాక్యుమెంట్లు తీసుకొని భార్యాభర్తలను ఇద్దరిని కామారెడ్డి రమ్మని చెప్పడం జరిగింది. అయితే కేవలం కృష్ణ ఒక్కడే రావడంతో నిజాంసాగర్ ఎక్స్ రోడ్ వద్ద సాయంత్రం చాయ్ హోటల్లో చాయ్ తాగించి అటువైపు నుండి తాడ్వాయిలో వైన్స్ వద్ద మందు తీసుకునేందుకు తన దగ్గర డబ్బులు లేవని గంగాధర్ చెప్పడంతో మృతుడు కృష్ణ ఫోన్ ఫోన్ పే పాస్వర్డ్ చెప్పడంతో.. అక్కడ గంగాధర్ డబ్బులు కొట్టి మందు తీసుకొని వెళ్లడం జరిగిందని డీఎస్పీ తెలిపారు.

అంతేకాకుండా మృతుడు కృష్ణకు మత్తు వచ్చేలా ఇంకా మద్యం తాగించి చివరికి లింగంపల్లి శివారులో డంపింగ్ యార్డ్ వద్ద బండిని ఆపి సిగరెట్ తాగుతూ మెట్లపై కూర్చొని అప్పటికే కృష్టకు మద్యం ఎక్కువ కావడంతో.. మూత్రం వస్తుందని లేచి డంపింగ్ యార్డ్ ముందట యూరిన్ పోస్తుండగా వెనక నుండి తోసి అతని మొహం మీద బండరాయితో రెండుసార్లు ఎత్తివేయగా రక్తస్రావం అయ్యి అక్కడికక్కడే మృతి చెందడం జరిగిందన్నారు. అంతేకాకుండా గంగాధర్ కృష్ణ ఫోన్ పే అకౌంట్ లో ఉన్న 50వేల రూపాయలు ఒకసారి ఇంకొకసారి 6000 రూపాయలు తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాడు తన నేరాన్ని స్వచ్ఛందంగా ఒప్పుకున్నా గంగాధర్ పోలీసులకు దొరకకుండా ఉండేందుకు దుబాయ్ పారిపోదామని ప్రయత్నం చేయగా.. పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుడు దగ్గర నుండి పల్సర్ బైకు పాస్పోర్టు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.కేసు చాకచక్యంగా వ్యవహరించిన సదాశివ నగర్ సిఐ సంతోష్ కుమార్ ను, సదాశివ నగర్ ఎస్సై రంజిత్ ను, క్రైమ్ పార్టీ రవిని, శ్రీనివాస్, వెంకట్రాములను సాయిబాబా లను డిఎస్పి అభినందన కాకుండా జిల్లా ఎస్పీ సింధు శర్మ కూడా అభినందించడం జరిగిందని అంతేకాకుండా హత్య కేసును ఇంత త్వరగా చేదించిన పోలీసులకు క్యాష్ రివార్డ్, ప్రశంస పత్రాలు మంజూరు చేస్తామని జిల్లా ఎస్పీ సింధు శర్మ ఎల్లారెడ్డి డిఎస్పి శ్రీనివాసులు తెలిపారు.


Similar News