చేపలు పట్టడానికి వెళ్లిన యువకుడు మృతి

చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు కాళ్లకు వల చుట్టుకుని ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన కామారెడ్డి పెద్ద చెరువులో చోటుచేసుకుంది.

Update: 2024-02-13 14:32 GMT

దిశ, కామారెడ్డి : చేపలు పట్టడానికి వెళ్లిన ఓ యువకుడు కాళ్లకు వల చుట్టుకుని ఊపిరాడక నీటిలో మునిగి మృతి చెందిన సంఘటన కామారెడ్డి పెద్ద చెరువులో చోటుచేసుకుంది. దేవునిపల్లి ఎస్సై రాజు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన పంపరి బాల్ నర్సింలు (33) అనే యువకుడు చేపలు పట్టడానికి ఆదివారం సాయంత్రం కామారెడ్డి పెద్ద చెరువులోకి వెళ్లాడు. రాత్రి వరకు బాల్ నర్సింలు ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు అతని ఆచూకీ కోసం వెతికారు.

    సోమవారం మధ్యాహ్నం చెరువు వద్దకు వెళ్లి చూడగా మృతుని చెప్పులు, సెల్ఫోన్ లభించాయి. నీటిలో మృతదేహం కోసం గాలించినప్పటికీ లభించలేదు. మంగళవారం మృతదేహం లభ్యం కావడంతో మృతుని కాళ్లకు చేపల వల చుట్టుకొని ఉందని పేర్కొన్నారు. అయితే కాళ్లకు చేపల వల చుట్టుకోవడం వల్లనే ఊపిరాడక నీట మునిగిపోయినట్లు పోలీసులు పేర్కొన్నారు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వివరించారు.


Similar News