జీవితం పై విరక్తి చెంది యువకుడు ఆత్మహత్య

ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో జీవితం పై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం కామారెడ్డిలో చోటుచేసుకుంది.

Update: 2024-02-09 09:38 GMT

దిశ, కామారెడ్డి : ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్న ఓ యువకుడు ఎన్ని ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్నా తగ్గకపోవడంతో జీవితం పై విరక్తి చెంది రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన శుక్రవారం కామారెడ్డిలో చోటుచేసుకుంది. రైల్వే ఎస్సై తావూ నాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని బీడీ వర్కర్స్ కాలనీకి చెందిన

    తిరునగరి హరీష్ కుమార్ (33) అనే యువకుడు సుమారు పదేళ్ల నుంచి ఫిట్స్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఎన్ని ఆసుపత్రిలో చూపించినా నయం కాకపోవడంతో జీవితం పై విరక్తి చెందిన హరీష్ కుమార్ కామారెడ్డి ఉప్పలవాయి రైల్వే స్టేషన్ల మధ్య రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.


Similar News