గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఘన స్వాగతం
నిజామాబాద్ జిల్లాలో హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ ఆదివారం పర్యటించారు
దిశ ప్రతినిధి,నిజామాబాద్ నవంబర్ 10: నిజామాబాద్ జిల్లాలో హర్యానా గవర్నర్ బండార్ దత్తాత్రేయ ఆదివారం పర్యటించారు. రెంజల్ మండలం కందకుర్తిలోని త్రివేణి సంగమంలో గంగా హారతిలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనకు డిచ్పల్లిలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. డిచ్ పల్లిలోని బీజేపీ నాయకుడు గద్దె భూమన్న ఇంటికి వచ్చిన దత్తాత్రేయకు అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో.. స్వాగతం పలికారు. గవర్నర్ దత్తాత్రేయను ధన్ పాల్ శాలువాతో సత్కరించారు. బీజేపీ సీనియర్ నాయకులు లోక భూపతిరెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులచారి తదితరులున్నారు. అనంతరం దత్తాత్రేయ రెంజల్ మండలం కందకుర్తికి వెళ్లారు.