మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంట ఆయిల్ పామ్
నమ్మకమైన దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
దిశ,నిజాంసాగర్: నమ్మకమైన దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ పామ్ అని, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలను రైతులు పండించాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఆయన శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గం లో ఆయిల్ పామ్ సాగుపై జిల్లా ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో.. రైతులకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ముఖ్య అతిథిగా,తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ తో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ..మన దేశం ఏటా రూ.లక్ష కోట్ల విలువైన వంట నూనెలను దిగుమతి చేసుకుంటుందన్నారు. అత్యధికం పామాయిలే ఇంతకు ముందు ఆయిల్ పామ్ పంటకు కోస్తా,ఖమ్మం జిల్లాలోనే సాగుకు అనుకూలం అనేవారు. అయితే నూతనంగా నేలలు, వాతావరణాన్ని పరిశీలించి తెలంగాణ లోని మిగితా జిల్లాలలో సుమారుగా ఏడు లక్షల ఎకరాలు ఆయిల్ పామ్ సాగుకు అనుకూలమని నిర్ధారించారన్నారు.
ఈ మొక్కలను ఒక్కసారి నాటేతే 30 సంవత్సరాల పాటు దిగుబడి వస్తుందని తెలిపారు. మొదటి మూడేళ్ళు దిగుబడి రాకపోయినా అంతర పంటలు వేసుకోని ఆదాయం సమకూర్చుకోవచ్చాని, సబ్సిడీపై మొక్కలను సరఫరా చేయడమే కాకుండా, మొక్కలను పెంచడానికి నాలుగేళ్ళు ఉద్యానశాఖ నిధులను అందిస్తుందని అన్నారు. నమ్మకమైన దిగుబడిని ఇచ్చే పంట ఆయిల్ పామ్, ప్రస్తుతం టన్ను రూ.19,000 రైతుకు అందుతుందన్నారు. ఏడాదికి ఎకరాకు 15 నుంచి 17 టన్నుల దిగుబడి వస్తుందని,కూలీల అవసరం పెద్దగా ఉండదు,కోతులు,చీడపీడల బెడద,తుఫాన్లు,వడగళ్ళ వానలకు నష్టపోదు,మార్కెట్ కు డొకా లేదని ఆయన అన్నారు. విస్తీర్ణం పెరిగితే స్థానికంగానే పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఆయిల్ ఫామ్ పొలాల చుట్టూ మలబార్ వేప నాటితే అధిక ఆదాయం పొందవచ్చు అన్నారు. అందరు ఒకే రకమైన పంటలను పండించి నష్టపోకుండా,డిమాండ్ ఉండి మార్కెట్ లో అధిక ధర లభించే పంటలను సాగు చేయాలని అన్నారు. నిజాంసాగర్ ప్రాజెక్టు ద్వారా పుష్కలంగా సాగునీరు అందుతుందని,నీరు అవసరమైన పంట కాబట్టి నీటికి డోకా లేదని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి జ్యోతి,బాన్సువాడ డివిజన్ ఏడిఏ లక్ష్మీ ప్రసన్న,బాన్స్ వాడ డివిజనల్ అధ్యాన అధికారిని సంతోషి రాణి, ఆయిల్ పామ్ ఏరియా మేనేజర్ మోహన్,బీర్కూర్ మండల నాయకులు, అధికారులు,రైతులు తదితరులు పాల్గొన్నారు