గౌడ హాస్టల్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి

జిల్లాలో గౌడ విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకుని వెనకబడిన విద్యార్థుల ఉన్నత చదువుకోసం కామారెడ్డి జిల్లాలో గౌడ హాస్టల్, గౌడలకు అత్యున్నత స్థాయి కోచింగ్ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీకి జిల్లా గౌడ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు.

Update: 2024-02-08 12:34 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో గౌడ విద్యార్థుల భవిషత్తును దృష్టిలో ఉంచుకుని వెనకబడిన విద్యార్థుల ఉన్నత చదువుకోసం కామారెడ్డి జిల్లాలో గౌడ హాస్టల్, గౌడలకు అత్యున్నత స్థాయి కోచింగ్ భవన్ నిర్మాణానికి 5 ఎకరాల స్థలం కేటాయించాలని ప్రభుత్వ సలహాదారులు మహ్మద్ షబ్బీర్ అలీకి జిల్లా గౌడ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు. కాగా భవన నిర్మాణానికి అవసరమైన స్థలం కేటాయించేందుకు షబ్బీర్ అలీ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. అలాగే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మధన్ మోహన్ రావును కలిసి

    హాస్టల్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా గౌడ సంఘం అధ్యక్షులు పల్లె రమేష్ గౌడ్, కార్యదర్శి బాలార్జున్ గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ బొంబోతుల లింగగౌడ్, బట్టు పల్లి నరేష్ గౌడ్, ఉపాధ్యక్షులు శంకర్ గౌడ్, తాటిపాముల నర్సాగౌడ్, నర్సా గౌడ్ (చిరంజీవి), బండారి సాయిరాం గౌడ్, దశ గౌడ్, ధర్మగోని రాజాగౌడ్, బొమ్ బోతుల యాద గౌడ్, పల్లె రామస్వామి గౌడ్, రావుల రమేష్ గౌడ్, యూత్ కమిటీ అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, బొంబోతుల నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News