ట్రావెల్ బస్సులో ప్రయాణికుడి బ్యాగ్ చోరీ

నిజామాబాద్ నగర శివారులో గల భవానీ హోటల్ వద్ధ అగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది.

Update: 2024-01-14 08:58 GMT

దిశ, నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ నగర శివారులో గల భవానీ హోటల్ వద్ధ అగిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికుడి బ్యాగ్ చోరీకి గురైంది. ఆ బ్యాగ్ లో 13 లక్షల నగదు ఉండటంతో బాధితుడు స్థానిక ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటన ఆదివారం ఉదయం జరిగింది. ముంబాయి నుంచి జగిత్యాల వెళ్తున్న వీనస్ ట్రావెల్ బస్సులో జగిత్యాల జిల్లాకు చెందిన హన్మంతు శనివారం ముంబాయిలో బస్సు ఎక్కాడు. ఉదయం స్థానికంగా భవానీ హెటల్ వద్ధ టిఫిన్, వాష్ రూం కోసం బస్సును ఆపారు.

    అప్పుడు హన్మంతు తన రెండు బ్యాగులను బస్సులోనే ఉంచి వాష్ రూంకు వెళ్లి వచ్చాడు. అప్పటికే గుర్తు తెలియని వ్యక్తులు సంబంధిత 13 లక్షల నగదు కలిగిన ఓ బ్యాగును ఎత్తుకెళ్లారు. హన్మంత్ తన బ్యాగ్ కనిపించకపోయేసరికి బ్యాగ్ కోసం అంతా వెతికి స్థానికంగా ఆరవ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీస్ లు ట్రావెల్ బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేసి అక్కడ బ్యాగ్ దొరక్కపోవడంతో బస్సు తో పాటు ప్రయాణికులను పోలీస్ స్టేషన్ కు తరిలించారు. హన్మంతు రెండు బ్యాగులలో వ్యాపార నిమిత్తం

    19 లక్షల నగదుతో ప్రయాణిస్తుండగా అందులో 13 లక్షలు నగదు కలిగిన ఓ బ్యాగ్ చోరీకి గురి కాగా మరో 6 లక్షలు ఉన్న బ్యాగ్ బస్సులోనే ఉంది. ముంబాయిలో బస్సు ఎక్కే సమయంలోనే హన్మంతు నగదుకు సంబంధించిన సమాచారంను బస్సు క్లీనర్ కు చెప్పినట్లు తెలిసింది. భవానీ హోటల్ వద్ధ ఉన్న సీసీ టీవీ పుటేజ్ లను తీసుకుని పరిశీలిస్తున్నారు. ఉదయం వేళ అదే హోటల్ వద్ధ మరో బస్సు ఉండగా అది హైద్రాబాద్ వెళ్తుండగా దారి మధ్యలో పోలీస్ లు అక్కడి స్థానిక పోలీస్ లకు సమాచారం ఇచ్చి తనిఖీలు చేయిస్తున్నట్లు తెలిసింది. 


Similar News