ఆర్మూర్లో మోడల్ గురుకులం నిర్మించాలి

రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో మోడల్ గురుకులం నిర్మిస్తున్నట్లు పేపర్లో శుభవార్త విన్నానని, ఇది మంచి నిర్ణయం అని ..కొడంగల్ లో నిర్మిస్తున్నట్లు ఆర్మూర్ నియోజకవర్గంలో సైతం నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

Update: 2024-02-16 13:12 GMT

దిశ, ఆర్మూర్ : రాష్ట్రంలోని కొడంగల్ నియోజకవర్గంలో మోడల్ గురుకులం నిర్మిస్తున్నట్లు పేపర్లో శుభవార్త విన్నానని, ఇది మంచి నిర్ణయం అని ..కొడంగల్ లో నిర్మిస్తున్నట్లు ఆర్మూర్ నియోజకవర్గంలో సైతం నిర్మించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. శాసనసభ సమావేశాల్లో భాగంగా శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. శాసనసభకు వచ్చి గ్యాలరీలో కూర్చుండి చూడాలని తనకు ఉండేదని, కానీ ఆర్మూర్ నియోజకవర్గ ప్రజల తీర్పుతో అసెంబ్లీకి తొలిసారిగా వచ్చి మాట్లాడుతున్నానని ఈ సందర్భంగా ఆర్మూర్ నియోజకవర్గ ప్రజలకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు.

     తాను తొలిసారి ఎమ్మెల్యే కావున ఒక రెండు నిమిషాలు మాట్లాడే సమయం ఎక్కువైనా అవకాశం ఇవ్వాలని శాసనసభ స్పీకర్ కు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. ఆర్మూర్ లో రెసిడెన్షియల్ పాఠశాలలు అధ్వానంగా ఉన్నాయని, హాస్టల్ లోని ఒకే గదిలో 30 నుండి 40 మంది వరకు అవస్థలు పడుతూ ఉంటున్నారని అన్నారు. ఆర్మూర్ లో 100 పడకల ఆసుపత్రి పేరుకు మాత్రమే ఉందని, దీనికి సరిపడా డాక్టర్లు, నర్సులు వైద్య పరికరాలు లేక ఇబ్బందులు ఉన్నాయని, వైద్య శాఖ మంత్రి కి పలుమార్లు చెప్పినట్లు సభ దృష్టికి తీసుకువచ్చారు.

    వైద్య శాఖ మంత్రి కి వివరించిన పరిస్థితి ఇప్పటి వరకు 100 పడకల ఆసుపత్రిలో అలాగే ఉందన్నారు. పరిశ్రమలు లేక యువత మత్తు పదార్థాల కు బానిస అవుతున్నారని, ఆర్మూర్ నియోజకవర్గంలో లక్కంపల్లి సేజ్ లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని, చిక్లి, గుంజ్లి, కంఠం గ్రామాల లిఫ్ట్ పనులు ప్రారంభం చేసి రైతులకు నీరు అందించాలని కోరారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ను కావడంతో తనకు ప్రోటోకాల్ పాటించడం లేదని, ఈ కక్ష సాధింపు పద్ధతి కాదని, ప్రభుత్వానికి ఇది మంచిది కాదు అని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి శాసనసభలో ఆయనకు ఎదురవుతున్న ఇబ్బందులను సభ సభ్యుల ముందు సభ దృష్టికి తీసుకువచ్చారు.


Similar News