మేకల మందపై చిరుత పులి దాడి
గాంధారి మండలం మడుగు తండా పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు తండా వాసులు తెలిపారు.
దిశ , గాంధారి : గాంధారి మండలం మడుగు తండా పరిసరాల్లో చిరుత సంచరిస్తున్నట్లు తండా వాసులు తెలిపారు. రోజు లాగే శనివారం తండా వాసులు మేకల మందను తీసుకొని తండా పరిసరాలలో మెపుతూ ఉండగా..చిరుత పులి మందపై దాడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. దాడిని గమనించిన కాపరులు గట్టిగా కేకలు వేయడంతో.. చిరుత పారిపోయిందని వారు ఆరోపించారు. చిరుత దాడిలో ఓ మేక గాయపడిందని , చికిత్స నిమిత్తం మండల కేంద్రంలోనీ పశువైద్య శాలకు తీసుకువచ్చినట్లు తెలిపారు.