ఎంపీడీఓ కార్యాలయంలో నాగుపాము ప్రత్యక్షం

బోధన్ నియోజకవర్గం రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది.

Update: 2024-12-28 15:52 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్ డిసెంబర్ 28: బోధన్ నియోజకవర్గం రెంజల్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో శనివారం నాగుపాము ప్రత్యక్షమైంది. కార్యాలయంలోని ఉద్యోగులను ఒక్కసారిగా ఆగమాగం చేసింది. కార్యాలయంలోని బాత్‌రూంలో పాము కనిపించడంతో ఉద్యోగులు భయాందోళనకు గురయ్యారు. దీంతో పాములు పట్టే వ్యక్తిని పిలిపించడంతో..ఒడుపుగా పామును గ్రామ శివారులో జనసంచారం లేని చోట వదిలేశాడు.


Similar News