నిజామాబాద్‌లో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ పాదాయాత్ర

నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు నగరంలో భారీ పాదయాత్ర నిర్వహించారు.

Update: 2023-11-28 13:26 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా తన ఎన్నికల ప్రచారంలో భాగంగా చివరి రోజు నగరంలో భారీ పాదయాత్ర నిర్వహించారు. ముచ్చటగా మూడవ సారి అర్బన్ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న బీఆర్ఎస్ అభ్యర్థి గణేష్ బిగాల నగరంలో బారీగా పాదయాత్ర నిర్వహించారు. ప్రచారంలో చివరి రోజు సోమవారం నగరంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి గణేష్ బిగాల పాదయాత్ర నిర్వహించారు. నగరంలోని హనుమాన్ జంక్షన్ లో ప్రారంభమైన భారీ పాదయాత్ర నగరంలోని ధర్నా చౌక్ వరకు సాగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గణేష్ బిగాల మాట్లాడుతూ.. నిజామాబాద్ నగరం లో 9 ఏండ్లలో బ్రహ్మాండంగా అభివృద్ధి పనులు జరిగాయని అందుకు ప్రత్యక్ష ఉదాహరణ..ఐటి హబ్ కట్టినం.. మినీ ట్యాంక్ బండ్ కట్టినం.. సమీకృత కలెక్టర్ కార్యాలయం, మున్సిపల్ కార్యాలయం ,అండర్ గ్రౌండ్ డ్రైనేజి కట్టినం అన్నారు. మేము కడుతుండే ప్రతిపక్ష పార్టీల నాయకులు కూలిపోతాయి అంటున్నారు.

అని మేము ఐటి హబ్ నిర్మాణం చేసి ఉద్యోగలిస్తే వాళ్లేమో ఉద్యోగాలు పోతాయి అంటున్నారు అన్నారు. 9 సంవత్సరాలుగా నిజామాబాద్ ప్రశాంతంగా ఉంది అది మీ అందరికీ తెలుసు, ఎలాగైనా గెలవాలని కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్నారు, రెచ్చగొట్టే ప్రసంగాలు, సోషల్ మీడియాలో ఫెక్ వార్తలు ప్రచారం చేస్తున్నారు అని గుర్తు చేశారు. కాంగ్రెస్ ,బిజెపి పార్టీలు ఒక్కటై డ్రామాలు చేస్తు గొడవలు సృష్టించి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారు అని రెండు పార్టీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టి ఎన్నికల మ్యానిపెస్టోను అమలు చేస్తామని అన్నారు.బి.ఆర్.ఎస్ పార్టీ గెలుస్తుందని భారతదేశంలో ఉన్న అన్ని సర్వే సంస్థలు చెబుతున్నాయి.అభివృద్ధి ని ఆధారిస్తూ సంక్షేమాన్ని కొనసాగించడం కోసం నిజామాబాద్ నగరం శాంతి యుతంగా ఉండటం కోసం కారు గుర్తుకి ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతు కిరణ్ ,మాజీ మేయర్ ఆకుల సుజాత, సుజిత్ సింగ్ ఠాకూర్, సూదం రవి చందర్,సత్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.


Similar News