ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి

ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

Update: 2024-08-28 16:40 GMT

దిశ, మద్నూర్ : ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఇంటింటి సర్వే ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా జుక్కల్ అసెంబ్లీ నియోజక వర్గంలో ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నారు. బుధవారం మద్నూర్ మండల కేంద్రంలో నిర్వహించారు. ఇంటింటి సర్వే కార్యక్రమాన్ని అదనపు జిల్లా కలెక్టర్ డి. శ్రీనివాస్ రెడ్డి పరిశీలించారు. సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ ను సర్వే తీరును అడిగి తెలుసుకున్నారు. ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని, నూతనంగా 18 సంవత్సరాలు చేరిన వారికి ఓటరుగా చేర్చాలని దరఖాస్తులు తీసుకోవాలని అన్నారు.

    ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులను పరిశీలించి, ఇంట్లో ఉంటున్నారా.. లేదా.! వలస వెళ్లారా అని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఓటరు కార్డుకు ఆధార్ అనుసంధానం చేయాలని, మరణించిన వారి ఓటును తొలగించడానికి మరణ ధృవీకరణ పత్రం జత చేయాలన్నారు. తొలగించే క్రమంలో జాగ్రత్తగా ఒక క్రమం ప్రకారం చేయాలని తెలిపారు. జుక్కల్ అసెంబ్లీ నియోజకవర్గం మొత్తం ఇంటింటి సర్వే జరుగుతున్నట్లు తెలియజేశారు. అదనపు కలెక్టర్ వెంట మండల తహసీల్దార్ ఎం.డి ముజీబ్, ఎంపీడీవో రాణి , ఎలక్షన్ సీనియర్ అసిస్టెంట్ విజయ్ కుమార్ , బీఎల్ఓ సూపర్వైజర్ రవి కుమార్, బీఎల్ఓ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News