Prajavani : ‘ప్రజావాణి’కి 64 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు.

Update: 2024-11-04 11:21 GMT

దిశ ప్రతినిధి,నిజామాబాద్ నవంబర్ 04: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్)సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 64 ఫిర్యాదులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను ట్రైనీ కలెక్టర్ తో పాటు.. మెప్మా పీ.డీ రాజేందర్,ఇంచార్జ్ డీపీఓ శ్రీనివాస్,నిజామాబాద్ ఏసీపీ కిరణ్ కుమార్ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. అర్జీలను పెండింగులో పెట్టకుండా ఎప్పటిప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ.. వాటిని త్వరితగతిన పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ సంకేత్ కుమార్ సూచించారు.కప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని ట్రైనీ కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


Similar News