జిల్లాలో 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలు

జిల్లాలో 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు.

Update: 2024-09-20 12:34 GMT

దిశ, కామారెడ్డి : జిల్లాలో 351 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ తెలిపారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుపై శుక్రవారం తన కాన్ఫరెన్స్ హాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 23, సహకార సంఘాల ఆధ్వర్యంలో 328 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అక్టోబర్ రెండో వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తామని చెప్పారు. ముందస్తుగా అధికారులు కొనుగోలు కేంద్రాలను పరిశీలించాలని కోరారు. జిల్లాలో 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు.

    ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాల్ కు రూ.2203, సాధారణ గ్రేడ్ కు క్వింటాల్ కు రూ.2183 చెల్లించనున్నట్లు తెలిపారు. గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్స్, టార్పాలిన్లు సిద్ధం చేయాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు తాగునీటి వసతి, టెంటు, విద్యుత్​ సౌకర్యం కల్పించాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి, డీఆర్డీఓ సురేందర్, జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున బాబు, సివిల్ సప్లై మేనేజర్ రాజేందర్, సహాయ సివిల్ సప్లై అధికారి నరసింహారావు, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ట్రాన్స్​ఫోర్ట్​ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డీసీఓ రామ్మోహన్, ఎల్డీఎం రవికాంత్, జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య పాల్గొన్నారు. 

Tags:    

Similar News