శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి 14,000 క్యూసెక్కుల వరద నీళ్లు..
మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువకు 10 వేల క్యూసెక్కులు, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి 4వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు.
దిశ, బాల్కొండ : మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా విష్ణుపురి ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో దిగువకు 10 వేల క్యూసెక్కులు, గోదావరి పరివాహక ప్రాంతాల నుంచి 4వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతుందని ఏఈఈ కె.రవి తెలిపారు. వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని ప్రాజెక్టు కుడికాలువైన ఫ్లడ్ ఫ్లో కెనాల్ 5000 క్యూసెక్కులు, కరీంనగర్ జిల్లాలోని మిడ్ మానేరుకు నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. అదేవిధంగా కాకతీయ కాలువకు అనుసంధానంగా ఉన్న ఎస్కేప్ గేట్ల నుంచి గోదావరిలోకి 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు తెలిపారు.
కాకతీయ కాలువతో 6800 క్యూసెక్కుల నీటి విడుదల కొనసాగుతుంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 80.5 టీఎంసీలు కాగా సోమవారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టంతో నిండుకుండలా ఉంది. ఈ సీజన్లో ఎగువ ప్రాంతాల నుంచి 188.694 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందన్నారు. 115. 593 టీఎంసీల మిగులు జలాలను కాలువల ద్వారా గోదావరిలోకి విడుదల చేశామన్నారు.